వారసత్వం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా, ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి సినిమాకి తనని తాను మార్చుకుంటూ, అటు కమర్షియల్ సినిమాలని, ఇటు ప్రయోగాత్మక సినిమాలని బాలన్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగ చైతన్య.

Video Advertisement

జోష్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నాగ చైతన్య. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వకపోయినా కూడా, మొదటి సినిమాతో ఒక ప్రయోగం చేసినందుకు నాగ చైతన్యకి మంచి మార్కులు పడ్డాయి.

ఆ తర్వాత చేసిన ఏ మాయ చేసావే సినిమా కమర్షియల్ గా విజయం సాధించడంతో పాటు నటుడిగా నాగ చైతన్యని ఒక మెట్టు ఎక్కించింది. ఆ తర్వాత వచ్చిన 100% లవ్ సినిమా నాగ చైతన్యకి ఇంకా గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ ఉన్నా కూడా, ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గత కొంత కాలం నుండి నాగ చైతన్యకి సరైన హిట్ లేదు. గత సంవత్సరం వచ్చిన థాంక్యూ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఇటీవల వచ్చిన కస్టడీ సినిమా కూడా అంచనాలని అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకుని మరి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మళ్లీ లవ్ స్టోరీ తర్వాత ఈ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్యతో నటిస్తున్నారు.

naga chaitanya new look

అయితే ఈ సినిమా కోసం నాగ చైతన్య గెటప్ కూడా డిఫరెంట్ గా ఉండేలా చూసుకున్నారు. ఆ గెటప్ ఇవాళ బయటికి వచ్చేసింది. బేబీ సినిమా ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ నెక్స్ట్ సినిమా ఇవాళ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్, అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ వేడుకలో నాగ చైతన్య పాల్గొన్నారు.

గడ్డంతో నాగ చైతన్య చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇది చందు మొండేటి సినిమా కోసమే అని తెలుస్తోంది. ఈ సినిమాకి తండేల్ అనే పేరుని అనుకుంటున్నారు. అంతే కాకుండా నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే ఒక సిరీస్ కూడా చేశారు. ఈ సిరీస్ డబ్బింగ్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. నాగ చైతన్య కొత్త గెటప్ చూసిన అందరూ కూడా ఈ సారి హిట్ కొట్టేలాగా ఉన్నారు అని అంటున్నారు.

ALSO READ : ఒకప్పుడు ఈ 10 మంది టాప్ హీరోయిన్స్…కానీ ఇప్పుడు అవకాశాలు లేక ఫేడ్ అవుట్.?