గ్రాఫిక్స్ లేని రోజుల్లో “విచిత్ర సోదరులు” లో కమలహాసన్ ని మరుగుజ్జుగా ఎలా చూపించారో తెలుసా.?

గ్రాఫిక్స్ లేని రోజుల్లో “విచిత్ర సోదరులు” లో కమలహాసన్ ని మరుగుజ్జుగా ఎలా చూపించారో తెలుసా.?

by Sunku Sravan

Ads

అలనాటి కాలంలో సినిమా తీయడమే ఎంతో కష్టంతో కూడుకున్నపని. ప్రస్తుతం ఉన్నట్టు అన్ని టెక్నాలజీలు లేవు. కానీ సినిమాలు మాత్రం చాలా అద్భుతంగా తీసేవారు. మరి ఆ రోజుల్లోనే గ్రాఫిక్స్ లేకున్నా ఆ సినిమాలో కమల్ హాసన్ ను పొట్టిగా చూపించారు దర్శకుడు. మరి అది ఎలానో తెలుసుకుందామా..?

Video Advertisement

అప్పటి కాలంలో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మూవీస్ అన్ని చాలా విచిత్రంగా ప్రయోగాలతో కూడుకొని ఉండేవి. ఆ సమయంలో ఉన్నటువంటి స్టైల్ కు భిన్నంగా కొత్త కొత్త ఎలిమెంట్స్ తో చిత్రాలను విభిన్నంగా చూపించేవారు. ఇలా ఆ దర్శకుడు ఎన్నో భిన్నమైన హాస్యాస్పద చిత్రాలను అందించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఈ దర్శకుడు ఆయన సినిమాల్లో ఎక్కువగా కమలహాసన్ ని తీసుకున్నారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరియు కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక సినిమా చేద్దాం అనుకుని కమల్ హాసన్ ఒక చిన్న స్టోరీ లైన్ చెప్పగానే శ్రీనివాస రావు పూర్తి కథ రాసుకోవడం జరిగింది. అయితే ఈ మూవీకి నిర్మాణ బాధ్యతలు కమలహాసన్ తీసుకున్నారట. మూవీ విచిత్ర సోదరులు. 1989లోనే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మూవీలో పాత్ర అప్పు, అప్పు కు తల్లిగా శ్రీవిద్య నటించింది. ఇందులో హీరోయిన్ గా జానకి పాత్రలో గౌతమి నటించింది. ఇందులో మూడు పాత్రల్లో కమల్ హాసన్ నటించారు. ఒకటి అప్పు, రెండవది కమల్ హసన్ సేతుపతి, మూడవది రాజా. ఈ మూడు పాత్రల్లో మరుగుజ్జు పాత్ర కూడా ఉన్నది. మరి ఆ సమయంలో గ్రాఫిక్స్ లు అనేవి లేవు. కమలహాసన్ ఆ విధంగా ఎలా చూపించారు అనేది ఆ టైంలో ప్రేక్షకుల్లో మిస్టరీగా మిగిలిపోయిన ప్రశ్న. ఆ పాత్ర కాకుండా ఇంక వేరే పాత్రలో కమలహాసన్ ను చూపించడం కోసం కెమెరాని దూరం నుంచి లేదా దగ్గరనుంచి తీసేవారు.

మరి మరగుజ్జు పాత్ర కోసం ఆయన కాళ్ళను వెనుకకు మడిచి 18 అంగుళాల షూస్ తయారుచేయించి తొడిగేవారు. ఇందులో ఒక పాటలో కమల్ హాసన్ ను పొట్టిగా చూపించడం కోసం ప్రత్యేకంగా ఒక సోఫాను తయారు చేయించి అందులో కమల్ హాసన్ ని నడుము వరకు దించి అతని ముందు భాగంలో కృత్రిమ కాళ్లను అమర్చి, ఆ కాళ్లకు రెండు వైర్లు కట్టి కాళ్లు ఉగేలా చేసేవారు. దీనికోసం జపాన్ నుంచి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని తెప్పించి చేశామని ఒక ఇంటర్వ్యూలో సింగీతం శ్రీనివాసరావు చెప్పారు.


End of Article

You may also like