MEK: కోటి గెలిచినా.. అతని చేతికి వచ్చేది అంతేనా..? పన్ను ఎంత కట్టాలో తెలుసా…?

MEK: కోటి గెలిచినా.. అతని చేతికి వచ్చేది అంతేనా..? పన్ను ఎంత కట్టాలో తెలుసా…?

by Anudeep

Ads

ఎవరు మీలో కోటీశ్వరులు నవంబర్ 15, 16 ఎపిసోడ్స్ ని మరచిపోలేము. తొలిసారి కోటి రూపాయలు గెలుచుకొన్న ఎపిసోడ్‌ ఇది. సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ రాజా రవీంద్ర తన మేధస్సుతో కోటి రూపాయలను గెలుచుకున్నారు.

Video Advertisement

ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు ” షో ఎంతో పాపులర్ అవుతోంది. ఈ షో లో ప్రశ్నలు కొంచం ఈజీగా ఉంటున్నాయి అని టాక్ వినిపించినా.. హాట్ సీట్ పై కూర్చునే వాళ్ళకి చాలా ప్రెజర్ ఉంటుంది. అది కంట్రోల్ చేసుకుంటూ.. సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

Meelo evaru kotiswarulu

కోటి రూపాయలు గెల్చుకున్న తరువాత కూడా.. ఆ మొత్తం మన చేతికి రాదు. అందులో కొంత పన్ను కింద పోతుంది. అయితే, ఐటీ యు/ఎస్ 194బి‎‎ చట్టం ప్రకారం 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకే.. ప్రైజ్ మనీ ఇచ్చే సమయం లో చెక్ పైన కోటి చూపించినప్పటికీ.. చేతికి పన్ను డబ్బులు మినహాయించి మిగతావి చెల్లిస్తారు. కోటి రూపాయలు గెలుచుకున్న విజేతలు రూ.68,80,000 మాత్రమే పొందుతారు. మిగిలిన మొత్తాన్ని పన్నుగా చెల్లిస్తారు.


End of Article

You may also like