Ads
సినిమాల్లో కొన్ని సార్లు కథను అనుసరించి రొమాంటిక్ సన్నివేశాలు తీయాల్సి ఉంటుంది. వాటిని ఎంత సున్నితంగా, అందంగా తెరపై ఆవిష్కరించారు అనే దానిపై దర్శకుల ప్రతిభ తెలుస్తుంది. కానీ ఈ సన్నివేశాలు ఎలా చిత్రీకరిస్తారు..?? ఆ సమయంలో నటీనటులకు ఇబ్బంది ఉండదా అనే విషయాలు దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెలిపారు.
Video Advertisement
మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో సుధీర్ బాబు, కృతి శెట్టి హీరోయిన్గా రొమాంటిక్ యాక్షన్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ” చిత్రం విడుదల అయ్యింది. ఇప్పటికే ట్రైలర్ అండ్ టీజర్స్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.
ఈ చిత్ర ప్రమోషన్ల సందర్భంగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఎలా తీస్తారు అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. ” రొమాంటిక్ సన్నివేశాలు చాలా మెకానికల్ గా జరుగుతాయి. ఒకసారి ఇద్దరు నటులు ముద్దు పెట్టుకొనే సీన్ అయితే.. వారు దగ్గరకు వచ్చినపుడు కెమరామెన్ ఫోకస్ సరిగ్గా లేదనో ఇంకేదో చెప్తే.. వాళ్ళు ఆ పోసిషన్ లోనే ఉండాలి. ఆ సమయంలో ఫీలింగ్స్ అవి రావు.. కొన్ని సార్లు హీరో ఒక్కరే ఉంటారు..కొన్ని సార్లు హీరోయిన్ ఒక్కరే ఉంటారు. ఆలా కూడా ఆ సీన్స్ తియ్యొచ్చు.. ఇదంతా ఎడిటింగ్ మాయాజాలం.” అని దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి చెప్పారు.
ఈ మధ్య కాలంలో స్టంట్ డైరెక్టర్స్ లాగ ఇంటిమసీ డైరెక్టర్స్ అని వస్తున్నారు. ఇది వరకు హాలీవుడ్లో వీళ్ళు ఉండేవారు. ఇప్ప్డుడు బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. డైరెక్టర్ వాళ్ళకి ముందు సీన్ ని వివరిస్తారు. వాళ్ళు ఆ నటీనటులతో మాట్లాడి, వాళ్లకు ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశాలు షూట్ అయ్యేలా చేస్తారు. దీనికి డమ్మి రిహార్సల్స్ చేస్తారు.. లేదా నటులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో గమనించి అంత సాఫీగా అయ్యేలా చూస్తారు అని ఆయన వెల్లడించారు.
“నేనైతే నా సినిమాల్లో ఇటువంటి సినిమాలు తియ్యాలి అనుకున్నపుడు సెట్ లో ఆడవాళ్ళూ ఉండేలా చూస్తాను. ఒకవేళ హీరోయిన్ ఇబ్బంది పడితే వాళ్లకు తెలుస్తాయి. అంతేకాకుండా నేను కూడా నటీనటుల ఎదురుగా ఉంటా.. అప్పుడు వాళ్ళకి కొంచెం ధైర్యం గా ఉంటుంది. ఈ రకంగా నటించడం కూడా చాలా రిస్క్. దానికి అందరి సపోర్ట్ చాలా అవసరం. అందుకే నాకు ఆర్టిస్టులు అంటే చాలా గౌరవం” అని దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెలిపారు.
watch video :
End of Article