ఆ మెసేజ్ లు చూసి నా భర్త అలా అనేసరికి.. నేను మంచిదాన్నా ? చెడ్డదాన్నా? నా భర్త కావాలంటే నేనేమి చేయాలి..?

ఆ మెసేజ్ లు చూసి నా భర్త అలా అనేసరికి.. నేను మంచిదాన్నా ? చెడ్డదాన్నా? నా భర్త కావాలంటే నేనేమి చేయాలి..?

by Anudeep

Ads

ప్రతి మనిషి తన జీవితం తెలిసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పు సరిదిద్దుకుని సక్రమమైన మార్గంలో వెళుతూ ఉంటారు.

Video Advertisement

ఆ చేసిన తప్పే సమస్యగా మారి ఏ విధంగా వాళ్ళని ఎదురు దెబ్బ తీస్తుంది అని ఎవ్వరు ఊహించలేరు. ఇప్పుడు నేను కూడా అలాంటి సమస్యని ఎదుర్కొంటున్నాను.

నేను చదువుకునే రోజుల్లో నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే ఎంతో ఇష్టం అంటూ ఒక అబ్బాయి నా వెంట పడుతూ ఉండేవాడు. అతనంటే ఇష్టం వుంది, లేదు అనే విషయాన్ని ఎప్పుడూ అతనికి చెప్పలేదు. నేను ఎంత వద్దంటున్నా ఏదోవిధంగా నన్ను బెదిరించి, బతిమాలి బయటకు తీసుకెళ్ళేవాడు.

మా ఇంట్లో వారు నాకు సంబంధం చూడడంతో విషయం తెలిసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. జరిగిన విషయం కాబోయే అతనికి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయమని అడిగాను. తర్వాత ప్రాణంగా ప్రేమిస్తున్నానని  చెప్పినవాడు ఉన్నట్టుంది మాయమైపోయాడు.

మా తల్లిదండ్రులు నిశ్చితార్థం అయినా ఆ అబ్బాయిని ఒప్పించి వివాహం చేశారు. ఎంతో ఆనందంగా సాగిపోతుంది నా వివాహ జీవితం. ప్రేమించానని చెప్పిన వ్యక్తి తిరిగి మళ్లీ సుఖంగా సాగిపోతున్న  నా జీవితంలోకి అడుగు పెట్టాడు. గతంలో మేము స్నేహంగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు పంపుతూ నిన్ను కలవాలి అంటూ బెదిరింపు మెసేజ్ పంపుతున్నాడు. ఒకరోజు అనుకోకుండా ఈ మెసేజ్ లు, ఫొటోలు నా భర్త కంటపడ్డాయి.

ఆ ఫోటోలు, మెసేజ్ లు చూసినప్పటినుంచి నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు నాకు వద్దు నిన్ను వదిలేస్తా అంటూ అనడం మొదలు పెట్టారు నా భర్త. ఆయన ఎంతో మంచి వారు. నా  భర్తను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఇదంతా నా వల్లనే జరిగిందని రోజు బాధపడుతూనే ఉన్నాను. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి నేను ఎలా బయట పడాలి. నా భర్త నన్ను ఏ విధంగా అర్థం చేసుకునే లాగా చెయ్యాలో మీరు సరైన సమాధానం ఇవ్వండి.


End of Article

You may also like