మీ లైఫ్ పార్టనర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారని అనుమానంగా ఉందా? అయితే ఇలా తెలుసుకోండి!

మీ లైఫ్ పార్టనర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారని అనుమానంగా ఉందా? అయితే ఇలా తెలుసుకోండి!

by Anudeep

Ads

భార్య భర్తల బంధం అనేది ఎంతో నమ్మకంతో కట్టుకున్న కోట లాంటిది. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వారి సంసారజీవితం సవ్యంగా సాగిపోతుంది.ఎప్పుడైతే వాళ్ళ మధ్య అనుమానం అనే పెనుభూతం మొదలవుతుందో దాంపత్య జీవితంలో సంతోషం లేకుండా తయారవుతుంది.

Video Advertisement

ఈ అనుమానానికి కారణం జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని భావన కలగడం అయ్యుండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కాలంలో జీవిత భాగస్వామి మరోక వ్యక్తిపై  ఆకర్షితులు కావడం.

ఇప్పటిదాకా జీవితభాగస్వామి దగ్గర నచ్చిన విషయాలు వాళ్ళలో మార్పు వచ్చిన తర్వాత నచ్చకుండా పోతాయి. మరి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ఎలా గుర్తించాలో తెలుసుకోండి.. కొంతమంది బాధితులు తమ జీవిత భాగస్వామి మరో అమ్మాయితో చనువుగా మాట్లాడిన సహించలేరు. అదే విధంగా మగవారు కూడా తమ భార్యలు వేరొక వ్యక్తితో గాని స్నేహంగా ఉన్నా, ఎక్కువగా మాట్లాడుతున్న తట్టుకోలేరు. ఇలాంటి వారు ఈ చిన్న విషయానికి జీవిత భాగస్వామిని అనుమానిస్తుంటారు. కానీ తన అనుమానమే నిజం అనే విషయాన్ని ఎలా గుర్తించాలి అంటే..

#1.ఫోన్ లో సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారా:

భార్య లేదా భర్త తమ ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతున్నా అప్పుడు వాళ్ళు మీకు ఫోన్ ఇవ్వకుండా ప్రతి విషయాన్ని దాచడానికి ప్రయత్నించేటప్పుడు వారి ప్రవర్తనను అనుమానించాల్సిందే. ఆ విధమైన అనుమానం వచ్చినప్పుడు వారికి తెలియకుండానే వారి ఫోన్స్ గాని, లాప్టాప్ గాని పరిశీలించి నిర్ధారించుకోవడం మంచిది.

#2. సరైన సమాధానం ఇవ్వలేకపోవటం :

అదేవిధంగా ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే వారు మీ దగ్గర ఏదో దాస్తున్నారని అనుమానించాలి.

#3. అందంపై దృష్టి :

ఇదివరకు లేని కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటూ తమ అందం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం. మీరు మాట్లాడే విషయాలను పట్టించుకోకుండా ఉండటం, ఎక్కడ ఊహాలో తేలిపోతూ ఉన్నట్లు ప్రవర్తించడం వంటి విషయాలను గమనించాలి.

#4. స్నేహితుల ద్వారా:

అదేవిధంగా స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళు ద్వారా  తన రహస్యం ఏదైనా  బయట పడుతుందేమో అని ఆందోళనకు గురవుతున్నారా? అనేది కూడా గమనించుకోవాలి.


End of Article

You may also like