మహేష్ బాబు రాజకుమారుడు తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే సూపర్ హిట్ ను సాధించారు. తర్వాత చిత్రం కృష్ణ వంశీదర్శకత్వం లో వచ్చిన మురారి మహేష్ కెరీర్ లో పెద్ద హిట్ మూవీ అని చెప్పాలి .ఈ సినిమా లో మహేష్ నటనకు స్పెషల్ జ్యురీ నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా తో మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగారు ముఖ్యం గా లేడీ ఫాలోయింగ్ అయితే మరీ పెరిగిపోయింది.తర్వాత మాస్ సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చి పోకిరి తో స్టార్ గా తన గుర్తింపు ని పెంచుకున్నాడు .

mahesh murari

పోకిరి సినిమా తర్వాత మహేష్ తో మురారి సీక్వల్ ను చేయాలి అని కృష్ణ వంశీ అనుకున్నారు .కానీ మాహేష్ అప్పటికే మాస్ సినిమాలతో బిజీ ఉండటం ,ఫ్యామిలీ కంటెంట్ సినిమా అంటే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని అప్పట్లో వద్దు అనుకున్నారు .కానీ కృష్ణ వంశీ మాత్రం ఎప్పటికైనా మురారి 2 మహేష్ తోనే చేయాలి అనుకుంటున్నారు.మహేష్ మాత్రం అందుకు ఒప్పుకుంటారా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది .మహేష్ తో మళ్ళీ మురారి లాంటి సినిమా చూడాలి అని ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు .మరీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అని వేచి చూడాల్సిందే.