తెలుగులో అదరగొడుతున్న యానిమల్ సినిమా బుకింగ్స్.. రెస్పాన్స్ మాములుగా లేదుగా?

తెలుగులో అదరగొడుతున్న యానిమల్ సినిమా బుకింగ్స్.. రెస్పాన్స్ మాములుగా లేదుగా?

by Harika

Ads

హిందీ సినిమాలకు తెలుగులో ఆదరణ ఏ మేరకు ఉంటుందో మనందరికీ తెలిసిందే. షారుక్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లాంటి హీరోల సినిమాలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ తెలుగులో హిందీ సినిమాకు వారం రోజుల ముందు నుంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆ సినిమా మరేదో కాదు యానిమల్. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ప్రస్తుతం లెక్కలను బట్టి చూస్తుంటే యానిమల్స్ సినిమా లెక్కలు తిరగరాసేలా కనిపిస్తోంది. తెలుగులో ఈ సినిమాకు వారం రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Video Advertisement

ముఖ్యంగా చాలా మేజర్ సెంటర్స్‌లో బుకింగ్స్ అన్నీ ఫుల్స్ అయిపోయాయి. బాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్ ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. డిసెంబర్ ఒకటిన విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో తండ్రీ కొడుకుల రిలేషన్‌ను ఇప్పటి వరకు మరే దర్శకుడు ఇండియన్ స్క్రీన్ మీద చూపించని విధంగా ప్రజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు సందీప్. ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరుతుంది అని అంచనాలు వినిపిస్తున్నాయి.

అందుకు ప్రస్తుతం తెలుగులో అవుతున్న బుకింగ్స్ నిదర్శనంగా చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో యానిమల్‌కు తెలుగులో బుకింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రధాన నగరాల్లో ఈ సినిమా బుకింగ్స్ చాలా హైలో ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు ఒకటి రెండు రోజుల వరకు థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. అలాగే రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ హవా ఇంకా పెరగడం ఖాయం. తెలుగు బెల్ట్‌లోనే యానిమల్ కచ్చితంగా 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఒకవేళ టాక్ వర్కవుట్ అయి బొమ్మ బ్లాక్‌బస్టర్ అయితే అదేం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే సందీప్ వంగా క్రేజ్ అలా ఉంది మరి. ఇక హిందీలో ఈ సినిమాపై ఉన్న అంచనాలు లెక్కేయడం కష్టమే.


End of Article

You may also like