భార్య భర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. ఇద్దరూ కలిసి మెలిసి అన్యోన్యంగా ఉన్నప్పుడే ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో భర్తలు తమ భార్యాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల భార్యలు డిప్రెషన్ కు లోనయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడవచ్చు.

Video Advertisement

ముఖ్యంగా భర్త భార్యకు, పిల్లకు తగినంత సమయం కేటాయించకపోవడం వల్ల ఆ కుటుంబంలో సమస్యలు తప్పవు అంటున్నారు. సాధారణంగా భర్తలు తాము డబ్బు సంపాదించాలని, పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడతారు. భార్యకి, పిల్లలకి అన్ని సమకూరుస్తున్నాము. ఇంతకంటే ఏం చేయాలి అనే భావనలో ఉంటారు. వారు చేసే ఇలాంటి పొరపట్ల వల్ల భార్యలు మానసికంగా బాధపడుతారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
#1 భార్యలు తమ భర్త సంపాదించే డబ్బు కన్నా, తమకి సమయం ఇవ్వాలని కోరుకుంటారట. రోజు భర్త తమతో కొంచెం సమయం గడపాలని భార్యలు ఆశిస్తారు. కాబట్టి భర్త బిజీగా ఉన్నప్పటికి ప్రతి రోజు భార్య కోసం కొంత సమయం కేటాయించాలని చెబుతున్నారు.
#2 భర్తలు తమ భార్యాలకి ఆర్ధికంగా స్వేచ్చను ఇవ్వకపోవడం కూడా ఒక సమస్యే. కొందరు భర్తలు తమ భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికి ఆమె శాలరీ రాగానే మొత్తం తీసుకొని వాడుకోవడం చేస్తుంటారు. జాబ్ చేసేవారు అడిగి తీసుకో గలుగుతారు. కానీ ఇంట్లో ఉండే వారు తమకు కావలసిన డబ్బుని ఆడగలేక ఇబ్బంది పడుతుంటారు.
#3 కుటుంబానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే విషయంలో భార్యతో చర్చించకపోవడం వాళ్ళ భార్యలు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయలలో వారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
#4  సాధారణంగా భర్తలు భార్య తల్లిదండ్రుల పట్ల తమకు ఎలాంటి బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. వారికి కుమారులు ఉంటే వారి బాధ్యతను ఆ కుమారులే తీసుకుంటారు. కానీ కుమార్తె మాత్రమే ఉన్నట్లయితే భార్యకు తన  పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత, ప్రేమ ఉంటుంది. వారి కోసం బాధపడుతుంటుంది. కాబట్టి మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని అందరిని వదిలి మీతో బ్రతకడానికి వచ్చిన భార్యని బాధపెట్టకుండా సంతోషంగా చూసుకుంటే ఆ ఇల్లు ఆనందంగా మారుతుంది.

Also Read: 30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే…ఎదురుకోవాల్సిన 5 ప్రధాన సమస్యలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!