ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాలుగు విషయాలను భర్త తన భార్యకి చెప్పకూడదు అంట.? ఎందుకంటే.?

ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాలుగు విషయాలను భర్త తన భార్యకి చెప్పకూడదు అంట.? ఎందుకంటే.?

by Sainath Gopi

చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది.

Video Advertisement

చాణక్య నీతి భర్త భార్యతో ఎలాంటి విషయాలను చెప్పుకోకూడదు అనే దాని గురించి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త భార్యకి వీటిని చెప్పడం మంచిది కాదని చాణక్య నీతి అంటోంది. అయితే మరి ఆ విషయాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

#1. బలహీనత:

భర్త యొక్క బలహీనత భార్యకి అసలు చెప్పకూడదు. ఒకవేళ భార్యకి భర్త యొక్క బలహీనత తెలిస్తే దాని గురించి పదే పదే భార్య మాట్లాడుతుంది. అలాగే బలహీనత తెలుసు కాబట్టి భర్త దాని నుండి బయట పడాలని ప్రయత్నించినా కూడా అడ్డు పడుతుంది. కాబట్టి భర్తలు ఈ విషయాన్ని భార్యలకు చెప్పకూడదు.

#2. ఆదాయం:

ఆదాయాన్ని కూడా భర్త భార్యకి చెప్పకూడదు. భర్త కనుక భార్యకు ఈ విషయాలు చెబితే అనవసరమైన ఖర్చులు పెడుతుంది భార్య. కనుక దీనిని కూడా ఎప్పుడు చెప్పకూడదు.

#3. అవమానం గురించి:

అవమానం గురించి కూడా భర్త భార్యకి చెప్పకూడదు. ఒకవేళ చెప్తే చులకనగా చూడడం, పదేపదే దాని గురించి మాట్లాడటం చేస్తుంది. కాబట్టి భర్త పొందిన అవమానం గురించి కూడా భర్త భార్య కి చెప్పకూడదు.

#4. సహాయం:

భర్త ఏదైనా సహాయం చేయాలని అనుకున్న కూడా భార్య అడ్డుపడుతుంది. కాబట్టి అతను చేయాలనుకునే సహాయం గురించి కూడా భార్యతో చెప్పడం మంచిది కాదు.


You may also like