పేపర్ తో వాటర్ బాటిల్ ని తయారు చేసారు.. ఈ క్రేజీ ఐడియాకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే.. ఇన్స్పైరింగ్ స్టోరీ..!

పేపర్ తో వాటర్ బాటిల్ ని తయారు చేసారు.. ఈ క్రేజీ ఐడియాకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే.. ఇన్స్పైరింగ్ స్టోరీ..!

by Anudeep

Ads

ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలంటూ చాలా కాలం నుంచి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మితిమీరిన ప్లాస్టిక్ వాడకం వలన వాతావరణ కాలుష్యానికి ముప్పు ఏర్పడింది. అందుకే పలు చోట్ల ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే.. కొన్నిసార్లు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం సాధ్యం కావడం లేదు.

Video Advertisement

ముఖ్యంగా వాటర్ బాటిల్స్ కారణంగా ప్లాస్టిక్ ను ఎక్కువగా వాడాల్సి వస్తోంది. అయితే.. వాటర్ బాటిల్స్ కారణంగానే ప్లాస్టిక్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో కలియుగ వైకుంఠం తిరుమలలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించారు.

paper water bottles 1

అక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా ఉండవు. అక్కడ వాటర్ ను గాజు బాటిల్స్ లోనే అమ్ముతూ ఉంటారు. అయితే.. ఒక గాజు వాటర్ బాటిల్ ను కొనుక్కోవాలి అంటే కనీసం రెండొందల రూపాయల ఖరీదు చేస్తుంది. అదీ కాకుండా.. ప్రయాణ సమయాల్లో ఈ గాజు బాటిల్స్ అంత సురక్షితం కూడా కాదు. అందుకే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కి ఒక ప్రత్యామ్నాయం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ ఆలోచనని ఈ యువకులు పుణికి పుచ్చుకున్నారు. హైద‌రాబాద్ కు చెందిన సునీత్ తాతినేని, చైత‌న్య పేపర్ తో వాటర్ బాటిల్స్ ను తయారు చేయాలన్న సంకల్పాన్ని పెట్టుకున్నారు.

paper water bottles 2

వారి రోజువారీ జీవితాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నారు. అయితే.. వాటర్ బాటిల్స్ మాత్రం నిత్యావసరమే. దానికి ప్రత్యామ్నాయం దొరకలేదు. ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేసి ఒక రకమైన పేపర్ తో వాటర్ బాటిల్స్ తయారు చేయాలనీ అనుకున్నారు. ఇంట్లో వాడుకోవడానికైనా.. లేక ఎక్కడికైనా తీసుకు వెళ్ళడానికి అయినా అనుకూలంగా ఉండేవిధంగా రూపొందించాలని అనుకున్నారు. అలా ఈ ఇద్దరు యువకులు కలిసి ఆవిష్కరించిందే ఎకో ఫ్రెండ్లీ డ్రింకింగ్ వాటర్ బాక్స్. పూర్తిగా కారిగేటెడ్‌ పేపర్‌ ను ఉపయోగించి టేంపర్‌ప్రూఫ్‌ వాటర్‌ బాక్స్‌ ను తయారు చేసారు. ఈ బాక్స్ లో 85 % వరకు ప్లాస్టిక్ ను వాడలేదు. అంతేకాదు వీటిని రీసైకిల్ చేసుకోవచ్చు కూడా. ఈ వాటర్ బాటిల్ ను యాప్ లో బుక్ చేసుకుంటే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఆ బాటిల్ ఎక్సపైరీ డేట్ అయిపోయిన తరువాత దాని ప్లేస్ లో కొత్తది ఇచ్చి పాతది తీసుకెళ్ళిపోతారు.

paper water bottles 3

ఇలా వాటర్ బాటిల్స్ ని మాత్రమే కాదు.. వాటర్ కేన్స్ ని కూడా తయారు చేస్తున్నారు. మనం వాడుతున్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో ఉండే మైక్రో ప్లాస్టిక్‌ మనం వాటర్ తాగుతున్నప్పుడు మన శరీరంలోకి ప్రవేశించి అనేక రోగాలకు కారణం అవుతూ ఉంటాయి. ఇలాంటి రోగాలు రాకుండా ఉండడానికే పేపర్ తో వాటర్ బాటిల్స్ ను తయారు చేస్తున్నారు. అయితే వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఐదు లీటర్ల బాక్స్‌ ప్రైస్‌ 75 రూ. కాగా, ఇరవై లీటర్ల బాక్స్‌ 120 రూ. ఉంది. ఈ వాటర్ బాటిల్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయి.


End of Article

You may also like