“జబర్దస్త్‌”లో హైపర్ ఆది అందుకే కనిపించట్లేదా..? దీని వెనకాల ఇంత కథ ఉందా..?

“జబర్దస్త్‌”లో హైపర్ ఆది అందుకే కనిపించట్లేదా..? దీని వెనకాల ఇంత కథ ఉందా..?

by Harika

Ads

ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

Video Advertisement

ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. జబర్దస్త్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కమెడియన్స్ లో ఒకరు హైపర్ ఆది. గత కొన్ని సంవత్సరాలుగా తన స్కిట్స్‌తో అలరిస్తున్నారు హైపర్ ఆది.

హైపర్ ఆది కేవలం జబర్దస్త్‌లో మాత్రమే కాకుండా మరికొన్ని షోలలో కనిపిస్తున్నారు. అలాగే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా స్పెషల్ ఈవెంట్స్‌లో కూడా అలరిస్తున్నారు హైపర్ ఆది. ఆది ఢీ ప్రోగ్రామ్‌లో మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య ఈ టీవీలో ఈవెంట్స్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కువగా జరిగాయి. ఈ ప్రోగ్రామ్స్‌లో హైపర్ ఆది పాల్గొన్నారు. ఈ షూటింగ్స్‌లో బిజీగా ఉండడం వల్ల ఆది జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో పాల్గొనలేకపోయారు.

hyper aadi decision about jabardast

దాంతో కొద్ది రోజులు షోలో కనిపించలేదు. అయితే ఆది ఇటీవల జరిగిన ఢీ ఎపిసోడ్‌లో ఒక మాట అన్నారు. ఇందులో ఆది తాను మే నుండి షోకి రాను అని అన్నారు. అందుకు కారణం కూడా ఉంది. ఆది వేరే షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా జబర్దస్త్‌లో కూడా కనిపించట్లేదు. ఆది లేకపోవటంతో ఆ టీమ్‌లో ఉన్న అజర్, పరదేశి వేరే టీమ్స్‌లో స్కిట్స్ చేస్తున్నారు. రైజింగ్ రాజు గత కొద్ది రోజులనుండి కనిపించట్లేదు. ఇపుడు ఒక వేళ ఆది జబర్దస్త్ మానేస్తే ఎలా అన్న సందేహం అందరిలో నెలకొంది.


End of Article

You may also like