Ads
ఏదైనా ఒక పని చేస్తే అందులో జాబ్ శాటిస్ఫాక్షన్ ముఖ్యం. ఒకవేళ జాబ్ శాటిస్ఫాక్షన్ లేకపోతే మన పని ఎంత గొప్పదైనా మనకు ఏదో వెలితిగా అనిపిస్తుంది. అలా అని మనం చేసే దాన్ని వదిలేసి మనకి కావాల్సిన దాని కోసం ప్రయత్నిస్తే రిస్క్ తీసుకోవడమే అవుతుంది. కానీ అలా రిస్క్ తీసుకోకపోతే మన కలలు అనుకున్నట్టుగా నెరవేరకపోవచ్చు. ఇదే విధంగా కనిషక్ కటారియా కూడా తను చేసే జాబ్ వదిలేసి తను అనుకున్నట్టుగానే ఐఏఎస్ అయ్యారు.
Video Advertisement
జోడి స్టోరీ కథనం ప్రకారం కనిషక్ కటారియా ఐఐటీ బాంబే నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కొరియాలో సాంసంగ్ కంపెనీ లో జాబ్ చేసేవారు. అక్కడ శాలరీ బాగా వస్తున్నా కానీ తను చేస్తున్న ఉద్యోగం లో శాటిస్ఫాక్షన్ అనిపించలేదు. డబ్బులు సంపాదించడం ఒక్కటి తప్ప, కనిషక్ కటారియా కి వృత్తి పరంగా చాలా వెలితిగా ఉండేది.
దాంతో తన స్వస్థలమైన జైపూర్ కి వచ్చి ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టారు కనిషక్ కటారియా. దాదాపు రెండేళ్ల హార్డ్ వర్క్ తర్వాత 2018 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లో టాపర్ గా నిలిచారు కనిషక్ కటారియా. ఆ రెండేళ్లలో ఎమోషనల్ బ్రేక్ డౌన్ కి గురయ్యాను అని అన్నారు. కానీ తనకి తన కుటుంబం అండగా ఉంది అన్నారు.
kanishak kataria family
తన కుటుంబంతో పాటు తన గర్ల్ ఫ్రెండ్ సోనాల్ కి కూడా థాంక్స్ చెప్పారు కనిషక్ కటారియా. దాంతో నెటిజన్లు అందరూ సాధారణంగా చాలా మందికి ప్రేమ అనేది ఒక డిస్ట్రాక్షన్ అనే ఒక అపోహ ఉంటుంది అని, కానీ కనిషక్ కటారియా అది నిజం కాదు అని నిరూపించారు అని మెచ్చుకున్నారు.
End of Article