Ads
మెగా ఫ్యామిలీ అంతా కలిసి పండగ చేసుకున్న రోజు జూన్ 20. అదే మెగా వారసురాలు క్లిన్ కారా పుట్టిన రోజు. రామ్ చరణ్ కొణిదెల, ఉపాసనల పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత బేబీ పుట్టడం పుట్టడమే మెగా ఫ్యామిలీకి కళను తీసుకొచ్చింది.
Video Advertisement
అటు రామ్ చరణ్ కి కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోవడంతో రామ్ చరణ్ కు కూతురు పుట్టింది అనగానే అభిమానులు అందరూ సంబరాలు చేసుకున్నారు. చాలామంది సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతూ, బహుమతులు ఇచ్చారు తర్వాత బారసాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.
రామ్ చరణ్ దంపతులకు బహుమతులు అందుతూనే ఉన్నాయి. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా ఒక బంగారు పలకను బహుమతిగా ఇచ్చాడు. ఈ బహుమతిని చూసి అభిమానులందరూ ఆశ్చర్యపోయారు. బంగారు పలక అంటే ఏదో రాసుకోవడానికి ఇచ్చింది కాదు ఒక బంగారు పలక మీద బంగారు అక్షరాలతో క్లీన్ కారా అనే పేరు చెక్కి, తను పుట్టిన తేదీ, సమయం రోజు అన్నీ వచ్చేలా డిజైన్ చేసిన పలకను బహుమతిగా ఇచ్చాడు.
ఇది చూసి బన్నీ అభిమానులు అందరూ మా అన్న టేస్ట్ భలేగా ఉందే అంటూ పొగడ్తలతో ముంచారు. అంతకుముందు ఎన్టీఆర్ కూడా ఒక బంగారు డైమండ్ నెక్లెస్ ని బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో పుట్టిన గారాల పట్టి ఏకైక వారసురాలు జూన్ 20న జన్మించగా జూన్ 30న బారసాలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతి స్వరూపమైన మాత శక్తి కలిగి ఉన్న అనుగ్రహంతో కూడిన పేరును లలితా సహస్రనామం నుండి క్లీన్ కారా అని పేరు పెట్టినట్లు మెగా స్టార్ ప్రత్యక్షంగా తెలిపారు
ALSO READ : గుంటూరు కారం పాటలపై నిర్ణయం..! ఏం జరిగిందంటే..?
End of Article