కేవలం కళ్ళని చూసి ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టగలరా..? బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది..!

కేవలం కళ్ళని చూసి ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టగలరా..? బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది..!

by Mohana Priya

Ads

ప్రతి సంవత్సరం ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది హీరోయిన్స్ మాత్రమే గుర్తింపు సంపాదించుకుంటారు. వీరిలో కొంత మంది హీరోయిన్స్ మాత్రం, ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూనే ఉంటారు. అంత టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఇటీవల కాలంలో చాలా తక్కువ మంది వచ్చారు. ఇండస్ట్రీకి రావాలి అంటే అదృష్టం ఉన్నా కూడా తర్వాత పేరు నిలబెట్టుకోవాలి అంటే టాలెంట్ ఉండాల్సిందే. అందుకే కొంత మంది హీరోయిన్స్ సినిమాకి సినిమాకి తమని తాము మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు.

Video Advertisement

identify this celebrity with eyes

అలా స్టార్ హీరోయిన్స్ అవుతున్నారు. పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ కూడా అలాంటి ఒక హీరోయిన్. మొదట ఒక డాన్స్ షో చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నారు. మళ్లీ ఒక మలయాళం సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఆ సినిమాతో చాలా ఫేమస్ అయిపోయారు. ఆ తర్వాత తెలుగు సినిమా చేశారు. కొన్ని తమిళ్ సినిమాలు కూడా చేశారు. ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చి 9 సంవత్సరాలు అయ్యింది. ఈ తొమ్మిది సంవత్సరాలలో ఈ హీరోయిన్ చేసిన సినిమాలు చాలా తక్కువ. కానీ గుర్తింపు మాత్రం ఎక్కువగానే సంపాదించుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి రామాయణం. సీతగా ఈ హీరోయిన్ నటిస్తున్నారు.

అంతే కాకుండా తమిళ్ లో శివకార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్నారు. తెలుగులో నాగ చైతన్యతో కూడా ఒక సినిమా చేస్తున్నారు. కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ నటి. ఎంతో మంది హీరోలు, దర్శకులు ఈమె టాలెంట్ ని మెచ్చుకున్నారు. ఈమెతో కలిసి నటించాలి అని ఆకాంక్షించారు. స్టార్ హీరోలు కూడా ఈమె నటనని పొగిడారు. ఎన్నో అవార్డులు కూడా ఈ నటి సంపాదించుకున్నారు. ఏడాదికి ఒక సినిమా మాత్రమే ఈ నటి చేస్తున్నారు. అయినా కూడా అభిమానులు ఈమె సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం కళ్ళు మాత్రమే చూసి ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి.


End of Article

You may also like