మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే.. ఇలా చేయండి..!?

మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే.. ఇలా చేయండి..!?

by Anudeep

Ads

ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినా, అనుకున్నది జరగకపోయినా, ఆర్థికంగా నష్టపోయినా, మానసికంగా బాధపడినా కాలక్రమంలో మరిచిపోతాం. కానీ కొన్ని సంఘటనలు ఎక్కువ కాలం కొనసాగి, దానిలో నుంచి బయటకు రాలేపోతే డిప్రెషన్ లో ఉండిపోతాం. దీనివల్ల మానసికంగా దిగులు, నిస్సత్తువలతో పాటు శారీరకంగా అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి.

Video Advertisement

అందుకే మనం ఒకరి చేత మోసపోయినా, ఒకరు మనం బాధ పడేలా మాట్లాడినా ఎందుకు మనం వీక్ అవుతాం అంటే.. పదే పదే దాని గురించే ఆలోచించడం వల్ల. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే.. సంఘటన జరిగిపోయింది.. ఓకే.. తరువాత ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించి అందులో నుంచి బయటకు రావాలి.

 

అంతే కానీ జరిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మన ఎనర్జీ ని తగ్గించుకోవద్దు. అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉండడం వల్ల మనలో నెగటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి. చివరకు అవేలా తయారవుతాయి అంటే.. వాళ్ళను చంపడమా, మనం చవడమా అనే స్థాయికి చేరుకుంటాయి. దీంతో మనలో కోపం, ద్వేషం, అసూయ, అసహనం ఏడ్పు లాంటివి కలుగుతాయి.

 

మన శక్తినంతా ఆ వ్యక్తికి లేక ఆ సంఘటనకే ఖర్చు పెట్టేస్తాం. అలాకాకుండా మనం దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి. వాళ్ళను మార్చుకోవడమా, లేదా పూర్తిగా వదిలేయడమా అని నిర్ణయించుకోవాలి. అది ఫ్రెండ్స్ అయినా, బంధువులైన కావొచ్చు.. లేదా సంఘటన నుండి బయటపడాలంటే మరచిపోవడం అనేది ఒక గొప్ప మెడిసిన్‌ లాంటిది.

 

ఏవైనా ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు దాని గురించే ఆలోచించకుండా మన మూడ్‌ను డైవర్ట్‌ చేసుకుని దానిని మరచిపోవడానికి ప్రయత్నించాలి. ఒంటరిగే గడిపే వారికి గార్డెనింగ్, పెట్స్ ను పెంచుకోవడంతో పాటు పుస్తకాలు మంచి నేస్తాలు. అవి మీ మనస్సును ప్రతిబింబిస్తాయి. ఒక మంచి పుస్తకం చదివితే ఒక మంచి ఫ్రెండ్ ని కలిసిన అనుభూతి కలుగుతుంది. అలా ప్రయత్నించినట్లయితే మనం చాలా సులభంగా ఆ బాధ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి: నా భర్త ఇలా అన్ని చెప్పేయడం నచ్చట్లేదు.. చివరకు ఆ విషయాలు కూడా..? నా సమస్యకి పరిష్కారం ఏంటి..?


End of Article

You may also like