Ads
బుల్లితెర పై కామెడీ పంచె షో లలో “జబర్దస్త్” ముందుంటుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ రెండు షో లు బుల్లితెర కామెడీ ప్రపంచం లో రారాజు గా వెలిగిపోతున్నాయి. ఎక్సట్రా జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్, వర్ష జంట కూడా సరదా స్కిట్ లతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా, రిలీజ్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో లో కూడా వీరి స్కిట్ బాగానే పండిందని తెలుస్తోంది. ఇమ్మాన్యుయేల్ వర్ష పై పంచ్ లు కురిపించాడు.
Video Advertisement
“ఏంటి ఇంకా వాకిట్లో ముగ్గు వేయలేదు..? అంటే వాడు రాలేదు..” అంటూ ఇమ్మాన్యుయేల్ మొదలు పెట్టాడు.. దానికి వర్ష “పద్ధతి కి చీర కట్టినట్లు ఉంటాను.. నన్నే అనుమానిస్తున్నారా..” అంటూ బదులిచ్చింది. దానికి ఇమ్మాన్యుయేల్ వేసిన పంచ్ హైలైట్ గా నిలిచింది..
“చూడండమ్మా.. మా ఆవిడ పద్ధతి కి చీరకట్టినట్లుంటుందట..” అంటూ ఆమెను వెనక్కి తిప్పాడు. వర్ష ఫాషన్ బ్లౌజ్ ని ధరించడం పై ఇమ్మాన్యుయేల్ కామెంట్ చేసాడు.. ” ఎవరైనా బ్లౌజ్ కి చిన్న చిన్న కిటికీలు పెట్టుకుంటారు.. నువ్వెంటే 70 ఎమ్ ఎమ్ తెర పెట్టావు..” అంటూ కౌంటర్ వేసేసరికి నవ్వుల పువ్వులు పూశాయి..
End of Article