Ads
గతం లో ఒక వృద్ధురాలు పళ్ళు అమ్ముతూ ఉండేది. ఒక యువకుడు ఆమె దగ్గర పళ్ళు కొన్నాడు. ఆ తర్వాత వాటి లోంచి ఒక పండు తీసి తిని చూసి.. ‘ఇది చాలా పుల్లగా ఉంది నాకు వద్దు..’ అంటూ ఆ వృద్ధురాలికి తిరిగి ఇచ్చేస్తాడు.
Video Advertisement
అప్పుడు ఆ వృద్ధురాలు దాన్ని తిని చూసి ‘తియ్యగానే ఉంది కదా బాబు..’ అంటుంది. అప్పుడు ఆ యువకుడు నాకు ఆ పండు వద్దు నువ్వే ఉంచుకో అని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ యువకుడి స్నేహితురాలు అతడి దగ్గరకు వచ్చి ‘నువ్వు ఎందుకు రోజు ఆమె వద్ద పళ్ళు కొని.. ఒక దాన్ని తిరిగి ఇచ్చేస్తావు..’ అని అడుగుతుంది.
అప్పుడు ఆ యువకుడు..’ఆ బామ్మ రోజు పళ్ళు అమ్ముతూ ఉంటుంది కానీ వాటిలో ఒక్క దాన్ని కూడా తినదు. నేను అందుకే ఇలా చేస్తున్నాను’ అంటదు. అలాగే ఆ బామ్మ పక్క దుకాణం వ్యక్తి బామ్మ తో..’నువ్వు ఎందుకు రోజు అతడికి త్రాసులో ఎక్కువ పళ్ళను వేస్తున్నావు..’ అని అడగ్గా.. బామ్మ దానికి సమాధానంగా ‘అతడు రోజు నేను తినాలని ఒక్కో పండుని ఏదొక వంక చెప్పి నాకు తిరిగి ఇచ్చేస్తూ ఉంటాడు.. అందుకే నాకు తెలియకుండానే నా త్రాసు అతడి కోసం ఎక్కువగా తూగుతుంది..:’ అని చెప్తుంది.
పైన చెప్పుకున్న ఘటనలో మంచితనాన్ని మనం పంచితే అది తిరిగి మనకు ఏదొక రూపం లో తిరిగి వస్తుందని చెబుతోంది. మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. మనం చేసిన మంచి తిరిగి మనకి ఏదోక రూపం లో మనకి సహాయం దక్కుతుంది. ప్రస్తుత కాలం లో ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం వల్లే ఇవాళ సమస్యలు పెరిగిపోయాయి. మంచితనం అనేది మనుషుల్లో తగ్గిపోయింది.
దేవుడు మనుషుల కోసం ఉష్ణం గక్కే పగలు నుంచి సాంత్వనం కోసం రాత్రిని ఇచ్చాడు. క్రూరమృగాల కీకారణ్యంలో తీయని ఫలాలను ఇచ్చాడు. నదులను గీత కొట్టి అంతే పారాలని ఇచ్చాడు. సముద్రానికి చెలియలికట్టలు గీచాడు. జబ్బు ఉన్నచోటే మందు ఇచ్చాడు. గాయపడిన చోట మాన్పుకోవడమూ నేర్పాడు. కంటిలో నీరు ఇచ్చి ఆనందబాష్పాలను కూడా చిలకరించాడు. ఇవన్నీ మనుషులకు ఇచ్చిన దేవుడు మనుషులు ఒకరితో ఒకరు దయగా ఉండాలని..ఇతరులను చూసి అసూయపడకుండా.. ఇతరుల సంతోషాన్ని చూసి సంతోషంగా ఉండాలని ఆశించాడు.
ఒక కాకి ఇబ్బందులలో ఉంటే క్షణాలలో వందల కాకులు పోగై వాటికి అండగా నిలుస్తాయి. ఆలాగే చాలా మూగజీవులు ఒకటికి మరోకటి అండగా ఉంటాయి. విజ్ఞత కలిగిన మనం ఎందుకు ఉండ కూడదు అని ఆలోచిద్దాం, సాటి వారికి సహాయంగా నిలబడదాం. చేతనైన సహాయ సహకారాలను అందిద్దాం. అది మానవ జాతి సహజ లక్షణం.
End of Article