Ads
కాన్‌బెర్రా వేదికగా బుధవారం రోజు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 13 పరుగుల తేడా తో టీం ఇండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 5 వికెట్ల నష్టానికి 302 పరుగుల స్కోర్ చేసింది. తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్ (59: 38 బంతుల్లో 3×4, 4×6) స్కోర్ చేయడంతో ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు కనిపించాయి.ఇన్నింగ్స్ 36వ ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో వరుస సిక్సర్స్ కొట్టిన మాక్స్‌వెల్, తర్వాత నటరాజన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బాల్ ని స్టాండ్స్ లోకి కొట్టేసారు. మాక్స్‌వెల్ క్రీజ్ లో ఉన్నంత సేపు భారత్ గెలుపుపై ఎవరికి ఆశలు లేవు. కానీ ఇన్నింగ్స్ 45వ ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా ముందు బౌన్సర్ తో మాక్స్‌వెల్ ని పరీక్షించారు. బాల్ ఎక్కువ ఎత్తుకి వెళ్లడంతో అంపైర్ దాన్ని వైడ్ గా డిక్లేర్ చేసారు.
Video Advertisement
ఆ తర్వాత లెగ్ సైడ్ యార్కర్ సంధించినా కూడా అది వైడ్‌గా వెళ్లింది. దాంతో బుమ్రా ఒత్తిడిలో ఉన్నారేమో అని భ్రమ పడిన మాక్స్‌వెల్ వికెట్స్ వదిలేసి వెనక్కి వెళ్లి ఆడే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయం అనుకున్న బుమ్రా యార్కర్ సంధించారు. ఆ బాల్ ని అడ్డుకునేందుకు మాక్స్‌వెల్ ప్రయత్నించినా కూడా లాభం లేకపోయింది. మాక్స్‌వెల్ అవుట్ అవడంతో ఒత్తిడికి గురైన ఆస్ట్రేలియా జట్టు వరుసగా వికెట్లు చేజార్చుకుని మరో మూడు బాల్స్ మిగిలి ఉండగానే 289 పరుగులకి ఆలౌటైంది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2 #3 #4 #5#6 #7 #8 #9 #10 #11
End of Article