Ads
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకి జరిగిన మూడవ టెస్ట్ డ్రాగా నిలిచింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీం ఇండియా 334/5 స్కోర్ చేసింది. హనుమ విహారి(23*; 161 బంతుల్లో 4×4), రవిచంద్రన్ అశ్విన్(39*; 128 బంతుల్లో 7×4) కీలక ఇన్నింగ్స్ లో ఆడి, చివరి వరకు క్రీజ్ లో నిలిచి ఆసీస్ విజయాన్ని ఆపారు. సోమవారం రోజు 98/2 ఓవర్ నైట్ స్కోర్ తో ఐదవ రోజు ఆటని ప్రారంభించిన టీమిండియా, మరో 3 వికెట్లు కోల్పోయి 236 పరుగుల స్కోర్ చేసింది. చివరి రోజు ఆట మొదలైన కొద్ది సేపటికే కెప్టెన్ అజింక్య రహానె(4) స్కోర్ చేసి విఫలం అయ్యారు.
Video Advertisement
దాంతో టీమిండియా 102 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన పుజారా(77; 205 బంతుల్లో 12×4), పంత్(97; 118 బంతుల్లో 12×4, 3×6) తొలి సెషన్ లో ఇంకొక వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అలా లంచ్ బ్రేక్ సమయానికి టీమ్ స్కోర్ ని 70 ఓవర్లలో 206/3 కి తీసుకెళ్లారు. రెండవ సెషన్ లో పంత్ శతకానికి దగ్గరలో ఉన్నప్పుడు లైయన్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. స్క్వేర్ లెగ్ మీదుగా షాట్ ఆడడంతో ఫీల్డింగ్ చేస్తున్న కమిన్స్ చేతికి చిక్కారు.
అప్పటికి టీమిండియా 250/4 స్కోర్ చేసింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా ధాటిగా ఆడే క్రమంలో టీమ్ ఇండియా స్కోర్ 272 పరుగుల దగ్గర ఉన్నప్పుడు హేజిల్ వుడ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. దాంతో ఇండియా కొంత వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తర్వాత విహారి, అశ్విన్ ఇంకొక వికెట్ పడకుండా రెండో సెషన్ ని 280/5 తో ముగించడంతో ఆట అయిపోయే సమయానికి పాటు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20 #21 #22 #23 #24
End of Article