“అందుకే ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేయాలి.!” … అంటూ ఇంగ్లాండ్ తో రెండవ వన్డేలో ఇండియా ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్.!

“అందుకే ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేయాలి.!” … అంటూ ఇంగ్లాండ్ తో రెండవ వన్డేలో ఇండియా ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 20 ట్రోల్స్.!

by Mohana Priya

Ads

పూణే వేదికగా ఇంగ్లాండ్ జట్టుకి, టీమిండియాకి మధ్య జరిగిన రెండవ వన్డేలో 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియాలో కేఎల్ రాహుల్ (108: 114 బంతుల్లో 7×4, 2×6) సెంచరీ చేయగా, రిషబ్ పంత్ (77: 40 బంతుల్లో 3×4, 7×6), విరాట్ కోహ్లీ (66: 79 బంతుల్లో 3×4, 1×6) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఇంగ్లాండ్ జట్టు బౌలర్లలో టామ్ కరన్ రెండు వికెట్లు, టాప్లే రెండు వికెట్లు, శామ్ కరన్ ఒక వికెట్, ఆదిల్ రషీద్‌ ఒక వికెట్ పడగొట్టారు. టీమిండియా 6 వికెట్ల నష్టానికి 336 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జేసన్ రాయ్ (55: 52 బంతుల్లో 7×4, 1×6)తో కలిసి జానీ బెయిర్‌స్టో (124: 112 బంతుల్లో 11×4, 7×6) ఇన్నింగ్స్ ప్రారంభించారు. హాఫ్ సెంచరీ తర్వాత జేసన్ రాయ్‌ రనౌట్ రూపంలో వెనుదిరిగారు. తర్వాత వచ్చిన బెన్ ‌స్టోక్స్ (99: 52 బంతుల్లో 4×4, 10×6) స్కోర్ చేశారు. జట్టు స్కోర్ 285 పరుగుల దగ్గర ఉన్నప్పుడు బెన్ ‌స్టోక్స్ అవుట్ అయ్యారు తర్వాత మూడు బంతుల వ్యవధిలో బెయిర్‌స్టో, కెప్టెన్ జోస్ బట్లర్ (0) అవుట్ అయ్యారు. చివరిలో లివింగ్‌స్టోన్ (27 నాటౌట్: 21 బంతుల్లో 1×4, 2×6), డేవిడ్ మలాన్ (16 నాటౌట్: 23 బంతుల్లో 1×4) స్కోరుతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇంగ్లండ్ జట్టు 43.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 337 పరుగుల స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18

#19

#20

#21

#22

#23


End of Article

You may also like