Ads
చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో టీమిండియా జోరు తగ్గింది. 19 పరుగుల దగ్గర ఓపెనర్ రోహిత్ శర్మ(6) అవుట్ అవ్వగా, కొంచంసేపటి తరువాత మరో ఓపెనర్ శుభమన్ గిల్ (29) అవుట్ అయ్యారు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి, అజింక్య రహానే వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఐదవ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన రిషబ్ పంత్ 91 పరుగుల దగ్గర అవుట్ అయ్యారు.
Video Advertisement
అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 578 పరుగుల స్కోర్ తో ఆల్ అవుట్ అయింది. ఆదివారం 555/8 స్కోర్ తో మూడవ రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్ ముగించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లో రూట్ 218, సిబ్లీ 87, స్టోక్స్ 82 పరుగులు పోప్ 34, డొమినిక్ 34, బర్న్స్ 33, బట్లర్ 30 పరుగుల స్కోర్ చేశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, అశ్విన్ మూడు వికెట్లు, ఇషాంత్ రెండు వికెట్లు, షాబాజ్ నదీమ్ రెండు వికెట్లు పడగొట్టారు.
73 పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో రిషబ్ పంత్ క్రీజ్ లోకి వచ్చారు. 40 బంతుల్లో 50 పరుగుల స్కోర్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. పుజారా కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ స్కోర్ చేశారు. ప్రస్తుతం టీమిండియా 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.సుందర్ 25, అశ్విన్ 8 పరుగుల స్కోర్ తో క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article