పాండ్య 6 …రవిశాస్త్రి పార్టీలు… అంటూ IND vs AUS 2nd T20 పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్.!

పాండ్య 6 …రవిశాస్త్రి పార్టీలు… అంటూ IND vs AUS 2nd T20 పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

సిడ్నీ వేదికగా సాగిన రెండవ టీ20లో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. టాస్ ఓడిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. షార్ట్‌ (9) స్కోర్ తో అవుట్ అయినప్పటికీ కూడా దూకుడుగా ఆడటంతో ఆసీస్ పవర్ ‌ప్లేలో 59 పరుగుల స్కోర్ చేసింది. తర్వాత మాక్స్‌వెల్‌ (22; 13 బంతుల్లో, 2×6)తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ (46; 38 బంతుల్లో, 3×4, 2×6) బౌండరీలు బాదడంతో 11 ఓవర్లకు 100 పరుగుల స్కోర్ చేసింది. చివరిలో హెన్రిక్స్‌ (26; 18 బంతుల్లో, 1×6), స్టాయినిస్ (16*, 7 బంతుల్లో, 1×6) స్కోర్ చేశారు. టీమిండియా బౌలర్లలో నటరాజన్‌ రెండు వికెట్లు, శార్దూల్ ఒక వికెట్, చాహల్ ఒక వికెట్ పడగొట్టారు. ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

టీం ఇండియాలో శిఖర్‌ ధావన్‌ (52; 36 బంతుల్లో, 4×4, 2×6), హార్దిక్ పాండ్య (42*; 22 బంతుల్లో, 3×4 ,2×6), విరాట్ కోహ్లీ (40; 24 బంతుల్లో, 2×4, 2×6), కేఎల్‌ రాహుల్‌ (30; 22 బంతుల్లో, 2×4, 1×6) స్కోర్ చేశారు. తొలి రెండు ఓవర్లలో నిదానంగా ఆడిన ఓపెనర్లు రాహుల్‌, ధావన్‌ తర్వాత టాప్‌ గేర్‌లో దూసుకెళ్లారు. ఆరవ ఓవర్‌ లో రాహుల్‌ భారీ షాట్ కి ప్రయత్నించి అవుట్ అయినా కూడా పవర్‌ ప్లేలో భారత్‌ 60 పరుగుల స్కోర్ సాధించింది. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్ కొనసాగించారు. టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నిన్నటి మనసు పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18


End of Article

You may also like