ఈ 11 మంది స్టార్ క్రికెటర్ల భార్యల గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఏ వ్యాపారాలు ఉన్నాయంటే?

ఈ 11 మంది స్టార్ క్రికెటర్ల భార్యల గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఏ వ్యాపారాలు ఉన్నాయంటే?

by Anudeep

Ads

ఇండియాలో క్రికెట్ కి,సినిమా రంగానికి ఉన్నంత క్రేజ్ మరేదానికి లేదంటే అతిశయోక్తి కాదు..ముఖ్యంగా క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానుల సంఖ్య కోట్లల్లో ఉంటుంది..చిన్నా,పెద్దా తేడాలేకుండా క్రికెట్ ని ఎంజాయ్ చేస్తుంటారు..క్రికెటర్స్ ని దేవుళ్లలా ఆరాధిస్తుంటారు..మన దేశ నాయకుల పేర్లు చెప్పలేని వాళ్లు కూడా క్రికెటర్ల పేర్లను ధోని,రోహిత్ శర్మ,విరాట్ కొహ్లీ,శిఖర్ ధావన్,సౌరవ్ గంగూలి…ఇలా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటారు..మరి అంతటి క్రేజ్ ఉన్న మన ఆరాధ్య క్రికెటర్స్ వైవ్స్ ఎవరు,ఏం చేస్తుంటారు..తెలుసుకుందామా…
క్రికెటర్ల భార్యలు అనగానే వాళ్ల పేరుప్రఖ్యాతల్లో సగం వీళ్లు తీసుకుని ఫలానా క్రికెటర్ భార్యగా మాత్రమే మిగిలిపోవట్లేదు..మన స్టార్ క్రికెటర్స్ కి తగ్గట్టుగా వాళ్లు కూడా వాళ్ల వాళ్ల రంగాల్లో వాళ్ల టాలెంట్ ని చూపించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు… క్రికెటర్ల టాలెంటెడ్ వైవ్స్ గురించి…వాళ్ల టాలెంట్ గురించి తెలుసుకుందాం…

Video Advertisement

సాక్షి ధోనీ w/O మహేంద్ర సింగ్ ధోనీ..

మన భారత మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ధోనీ భార్య సాక్షి ధోని… అప్పటివరకు మిస్టర్ కూల్ గా,అమ్మాయిల కలల రాకుమారుడిగా,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ధోనికి జోడి అయింది సాక్షి.ధోనితో పెళ్లి కాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది సాక్షి. పెళ్లి తర్వాత క్రికెట్లో ధోని దశ కూడా తిరిగింది..వీరిద్దరి గారాల పట్టి జీవా..పెళ్లికి ముందే హోటల్ మేనేజ్మెంట్ చేసింది సాక్షి,ట్రెయిన్ గా కోల్ కతాలో జాబ్ కూడా చేసింది..కోల్ కతలో తాజ్ బెంగాల్లో ఇంటర్న్ షిప్ ట్రెయిని గా చేసేటప్పుడే ధోనితో పరిచయం అయింది.ప్రస్తుతం “సాక్షి రావత్ ఫౌండేషన్” పేరిట అనాధలకోసం ఒక సంస్థని స్థాపించి,సంస్థ బాద్యతలు చూస్కుంటుంది.

రితికా సజ్దేష్ w/o రోహిత్ శర్మ

రితికా,ప్రొఫెషన్ స్పోర్ట్స్ మేనేజర్..గ్రాడ్యుయేషన్ తర్వాత కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ట్నైన్మెంట్ లో స్పోర్ట్స్ మానేజర్ గా పనిచేసింది..రోహిత్ శర్మ ని కలిసింది ప్రోఫెషనల్ మీట్ లోనే..సిక్స్ ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది ఈ జంట..వీరిద్దరికి ఒక కూతురు పేరు సమైరా శర్మ.

దీపికా పల్లికల్ w/o దినేశ్ కార్తిక్వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ భార్య దిపికా పల్లికల్ ఫేమస్ స్క్వాష్ ప్లేయర్..స్క్వాష్ ప్లేయర్స్ లో మొట్టమొదటి అర్జుణ అవార్డు గ్రహీత.అంతేకాదు పద్మశ్రీ అవార్డును సైతం కైవసం చేసుకుంది.ప్రొఫెషనల్ స్క్వాష్ అసోషియేషన్ టాప్ 10లో ఇండియాని నిలబెట్టిన ప్రతిభాశీలి.

గీతా బస్రా w/o హర్బజన్ సింగ్

గీతా బస్రా,బాలివుడ్ నటి..ఇమ్రాన్ హష్మీ నటించిన దిల్ దియా హై చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది గీతా. ది ట్రెయిన్,సెకండ్ హ్యాండ్ హజ్బెండ్,జిల్లా ఘజియాబాద్ తదితర సినిమాల్లో నటించింది..ఇండియన్ టర్బొనేటర్ గా పేరుగాంచిన హర్బజన్ సింగ్,గీతల వివాహం 2015లో జరిగింది.వీరిద్దరికి ఒక కుమార్తే.

ప్రియాంక చౌదరి w/o సురేశ్ రైనా

సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరియు బ్యాంకర్.గతంలో యాక్సెంచర్,విప్రో వంటి సంస్థలలో పని చేసింది..గ్రేసియా రైనా ఫౌండేషన్ స్థాపించి,సంస్థ బాద్యతలు చూసుకుంటుంది.గ్రేసియా సురేష్ రైనా,ప్రియాంకల కూతురు పేరు.. పిల్లలు మరియు తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించే సంస్థ గ్రేసియా రైనా ఫౌండేషన్.

ఆయేషా ముఖర్జీ w/o శిఖర్ ధావన్

ఆయేషా కిక్ బాక్సర్,అథ్లెట్.శిఖర్ ధావన్ తో వివాహానికి ముందే ఆయేషా కిక్ బాక్సర్ గా పేరుగాంచింది.. ఆయేషా ,శిఖర్ లది రెండవ వివాహం.శిఖర్ తో వివాహానికి ముందే ఆయేషాకు పెళ్లి జరిగి,ఇద్దరు పిల్లలున్నారు..వీరిద్దరి పరిచయం జరిగింది ఫేస్ బుక్లో..పరిచయం ప్రేమగా మారి,పెళ్లి వరకు వచ్చింది.ఆయేషాని పెళ్లి చేసుకోవడానికి శిఖర్ తన ఫ్యామిలితో చిన్నపాటి యుద్దమే చేసాడు..మొత్తానికి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

హాజెల్ కీచ్ w/o యువరాజ్ సింగ్

భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ భార్య హాజెల్ కీచ్ బ్రిటీష్ – మారిషన్ మోడల్.అంతేకాదు బాలివుడ్ నటి.బాలివుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన హాజెల్ బుల్లితెరపైన కూడా మెరిసింది.యాడ్స్ కూడా చేసింది..క్యాన్సర్ భారిన పడి క్రికెట్ కి దూరమైన యువరాజ్ కి మానసికంగా దగ్గరగా చేరి మద్దతునిచ్చింది.యువీకి సరిజోడిగా నిలిచింది.

అనుష్కా శర్మ w/o విరాట్ కొహ్లీ

“విరుష్కా” ఈ పదం ఎంత ఫేమసో మనందరికి తెలుసు..విరాట్ కొహ్లీ,అనుష్కల ప్రణయం,పరిణయం అంతా మన కళ్లముందు జరిగినట్టుగానే ఉంటుంది.మొదట్లో గుట్టుగా రిలేషన్ మెయింటెయిన్ చేసినప్పటికి తర్వాత,సోషల్ మీడియా ద్వారా తమ అప్డేట్స్ ఎప్పటికప్పడు ఫ్యాన్స్ కి అందచేసింది ఈ జంట.అనుష్కా ప్రఖ్యాత బాలివుడ్ యాక్టర్ గా మనకి సుపరిచితురాలే. రబ్ నే బనాది జోడి లో షారుక్ తో జత కట్టి తెరపై మెరిసిన అనుష్క,తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ నటనలో పరిణతి సాధిస్తూ బాలివుడ్లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది.

ప్రీతి నారాయణన్ w/o రవిచంద్రన్ అశ్విన్

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వైఫ్ ఇంజినీర్.వీరిద్దరూ సేమ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.వీరికి ఇద్దరు అమ్మాయిలు అకీరా,ఆద్యా.

మయంతి లాంగెర్ w/o స్ట్రావుట్ బిన్ని

మయంతి జర్నలిస్టు, ఫేమస్ స్పోర్ట్స్ యాంకెర్,క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మయంతి సుపరిచితురాలే.క్రికెటర్ స్ట్రావుడ్ బిన్నిని వివాహం చేసుకున్నారు మయంతి లాంగెర్.

సాగరికా ఘాట్గే w/o జహీర్ ఖాన్

సాగరికా ఘాట్గే నటి మరియు అథ్లెట్..ప్రముఖ బాలివుడ్ నటుడు షారుక్ నటించిన ఛక్ దే ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే..ఆ చిత్రంలో సాగరిక కీలక పాత్రలో నటించి వెండితెరకు పరిచయం అయింది.వివిధ చిత్రాలు,రియాలిటి షోలు మరియు వెబ్ సిరిస్ లలో కూడా నటించింది.

also Read : ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!


End of Article

You may also like