ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుకి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ డికాక్ (1) స్కోర్ చేయగా, తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (24: 15 బంతుల్లో 4×4)తో కలిసి రెండో వికెట్‌ కి రోహిత్ శర్మ (44: 30 బంతుల్లో 3×4, 3×6) 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

Video Advertisement

ఇన్నింగ్స్ 9 వ ఓవర్‌ లో బౌలింగ్‌ కి వచ్చిన అమిత్ మిశ్రా ఒక బంతి వ్యవధిలో రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా (0) ను అవుట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన కీరన్ పొలార్డ్ (2: 5 బంతుల్లో) కూడా అమిత్ మిశ్రా బౌలింగ్‌ లో ఎల్బీడబ్ల్యు గా అవుటయ్యారు. ఓపికగా క్రీజ్ లో నిలిచిన ఇషాన్ కిషన్ (26: 28 బంతుల్లో 1×4, 1×6) కి చివరిలో జయంత్ యాదవ్ (23: 22 బంతుల్లో 1×4) సహకారం అందించారు. కానీ జట్టు స్కోర్ 123 ఉన్నప్పుడు వద్ద ఇషాన్ కిషన్‌ ని అమిత్ మిశ్రా అవుట్ చేశారు. ముంబై ఇండియన్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 137 పరుగుల స్కోర్ చేసింది.

138 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ పృథ్వీ షా (7: 5 బంతుల్లో 1×4) మ్యాచ్ మొదట్లోనే వికెట్ చేజార్చుకోగా తర్వాత వచ్చిన మరొక ఓపెనర్ శిఖర్ ధావన్ (45: 42 బంతుల్లో 5×4, 1×6) నెం.3లో వచ్చిన స్టీవ్ ‌స్మిత్ (33: 29 బంతుల్లో 4×4)తో కలిసి బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. అయితే జట్టు స్కోర్ 64 వద్ద స్మిత్ అవుట్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ (7: 8 బంతుల్లో 1×4) స్కోర్ చేయగా కొత్త క్రికెటర్ లలిత్ యాదవ్ (22 నాటౌట్: 25 బంతుల్లో) స్కోర్ చేశారు. కానీ చివరిలో వచ్చిన షిమ్రోన్ హెట్మెయర్ (14 నాటౌట్: 9 బంతుల్లో 2×4) రెండు బౌండరీలు కొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి గెలుపు సులువైంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టు 19.1 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17


End of Article

You may also like