ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆరోగ్య సమస్యల కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గ‌తేడాది కృష్ణ పెద్ద కుమారుడు ర‌మేష్ బాబు అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా కృష్ణ మొద‌టి భార్య, మ‌హేశ్ బాబు త‌ల్లి ఇందిరా దేవి సైతం అనారోగ్యంతో క‌న్నుమూశారు.

Video Advertisement

ఇందిరాదేవి గారు చనిపోయిన కొద్ది రోజులకే కృష్ణ గారు కూడా చివరి శ్వాస విడిచారు. ఇప్పుడు వారి లైఫ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

కృష్ణ విజయ నిర్మల పెళ్లి గురించి కూడా ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కృష్ణ కి మొదట భార్య అయిన ఇందిరా ఉండగానే విజయ నిర్మల తో రెండో వివాహం చేసుకున్నారు. మరి అసలు ఎందుకు కృష్ణ ఇలా చేసారు..? కారణం ఏమిటి..?, ఈ సంగతి తెలిసిన కుటుంబ సభ్యులు ఏం అన్నారు అనేది కృష్ణ గారి తమ్ముడు శేషగిరి రావు చెప్పారు.

ఈ విషయం తెలిసాక వారి అమ్మ నాగ రత్నమ్మ గారు మాత్రం కోప్పడ్డారట. కానీ ఇందిరా మాత్రం ఏం అనలేదు. కంగారు పడి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని శేషగిరి రావు చెప్పారు. ‘సాక్షి’ సినిమా అప్పుడు వీళ్ళ మధ్య ప్రేమ పుట్టిందట. దానితో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. విజయ నిర్మలకి ఇది వరకే వివాహం అయ్యిందిట. నరేష్ కి కూడా ఆమె జన్మనిచ్చారు. అయితే కృష్ణ, విజయ నిర్మలకి మాత్రం ఎవరు పుట్టలేదని కృష్ణ గారి తమ్ముడు శేషగిరి రావు చెప్పారు.