10 సంవత్సరాల తర్వాత టెలికాస్ట్ అవుతున్న మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా…!

10 సంవత్సరాల తర్వాత టెలికాస్ట్ అవుతున్న మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా…!

by Mounika Singaluri

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే ఆయన కెరీర్ మొత్తంలోనూ ఇంద్ర సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమా మెగాస్టార్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ నటించిన ఈ సినిమాకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.

Video Advertisement

అయితే ఇంద్ర సినిమా శాటిలైట్ హక్కులు జెమినీ టీవీ దగ్గర ఉండేవి. జెమినీ టీవీలో ఇంద్ర సినిమాని ప్రసారం చేసేవారు. ఇంద్ర సినిమా ప్రసారమయ్యే ప్రతిసారి జెమినీ టీవీకి మంచి టిఆర్పి రేటింగులు నమోదు అయ్యేవి. అయితే తొమ్మిది సంవత్సరాల నుండి ఇంద్ర సినిమా టీవీలో టెలికాస్ట్ అవ్వడం మానేసింది.

దీనిపైన చిరంజీవి అభిమానులు చాలాసార్లు తమ బాధను వ్యక్తపరిచారు. చిరంజీవి సూపర్ హిట్ సినిమాని టీవీలో చూడలేకపోతున్నాము అంటూ బాధపడ్డారు. అయితే ఇప్పుడు చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పే విధంగా ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంద్ర సినిమా మళ్ళీ టీవీలో టెలికాస్ట్ చేసారు. ఇంద్ర సినిమా ప్రసార హక్కులను జీటీవీ కొనుగోలు చేసింది. 17 వ తేదీ ఆదివారం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగులో ఇంద్ర సినిమా ప్రసారం చేసారు. తొమ్మిదేళ్ల తర్వాత ఈ సినిమా ప్రసారం కావడంతో మంచి టిఆర్పి రేటింగులు నమోదు అవుతాయని చిరంజీవి అభిమానులతో పాటు ఛానల్ యాజమాన్యం కూడా అంచనా వేస్తుంది


You may also like

Leave a Comment