SUCCESS STORY: చెత్త బండి లాగుతూ… ఐఏఎస్ కోసం..! ఈ అమ్మాయి కథ ఏంటో తెలుసా..?

SUCCESS STORY: చెత్త బండి లాగుతూ… ఐఏఎస్ కోసం..! ఈ అమ్మాయి కథ ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

కలలు ఎవరైనా కనవచ్చు. కేవలం ఇలాంటి వాళ్లు మాత్రమే కలలు కనాలి అని ఎక్కడా రాసి లేదు. ఇవాళ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఉన్నత స్థాయికి ఎదగాలి అని కలకనే హక్కు మనకి ఉంది. దాని కోసం చాలా కష్టపడాలి. ఎక్కడో బస్ కండక్టర్ ఇవాళ సూపర్ స్టార్ అయినట్టు, కష్టపడితే ఎక్కడ ఉన్న వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అందుకోసం చరిత్రలో చాలా మంది మనుషులు ఉన్నారు. వాళ్లందరూ కూడా ఇదే విషయాన్ని ఎన్నో సార్లు నిరూపించారు. వాళ్ల స్ఫూర్తితోనే ఇప్పటికి కూడా చాలా మంది కలలు కని, వాటి కోసం కష్టపడి తమ జీవితాలను బాగు చేసుకుంటారు.

Video Advertisement

inspirational story of jaya lakshmi

అలా ఒక అమ్మాయి ఇప్పుడు తన భవిష్యత్తు కోసం కల కని, దాన్ని నిజం చేసుకోవడానికి కష్టపడుతోంది. అందులో ముందుకి కూడా వెళ్తోంది. ఆ అమ్మాయి పేరు జయలక్ష్మి. ప్రస్తుతం జయలక్ష్మి డిగ్రీ చదువుతోంది. మూసారాంబాగ్ సమీపంలోని సలీంగనగర్‌లో తల్లితో కలిసి ఉంటోంది. జయలక్ష్మి తల్లి మున్సిపాలిటీలో పనిచేస్తుంది. చెత్త సేకరిస్తూ ఉంటుంది.  జయలక్ష్మి తండ్రి కూడా జిహెచ్ఎంసి లోనే పనిచేస్తాడు. జయలక్ష్మి కూడా తన తల్లిదండ్రులకి సహాయం చేస్తుంది. చిన్నప్పటినుండి కూడా జయలక్ష్మికి చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలి అని ఆశ ఉండేది. అందుకోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదువుకోవాలి అని అనుకుంది.

inspirational story of jaya lakshmi

ఈ కారణంగానే 4 కిలో మీటర్లు నడిచి వెళ్ళేది. అయితే, ఇటీవల ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారి గాంధీ కింగ్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ స్కాలర్షిప్ వాళ్లు దరఖాస్తులు సబ్మిట్ చేయమన్నారు. ఇందుకు ఎన్నో వేల అప్లికేషన్లు వెళ్ళాయి. కానీ అందులో నుండి కేవలం 10 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ 10 మందిలో, తెలుగు రాష్ట్రాల నుండి కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. గర్వించదగ్గ విషయం ఏంటంటే, వీరిలో జయలక్ష్మి కూడా ఉంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా జూన్ లో జయలక్ష్మి అమెరికాకి వెళ్లి వచ్చింది. జయలక్ష్మి లక్ష్యం ఒక్కటే. ఐఏఎస్ అధికారి అవ్వడం.

inspirational story of jaya lakshmi

అందుకోసం ఇప్పటి నుండి కష్టపడుతోంది. జయలక్ష్మి మురికివాడల్లో ఉండే పిల్లలకి కూడా చదువు చెప్తుంది. అంతే కాకుండా, ఎన్నో సమస్యల మీద కూడా జయలక్ష్మి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే హైదరాబాద్  లో 56 మురికివాడలు ఉన్నాయి. ఇందులో 21 ప్రాంతాల్లో అంగన్ వాడీ కేంద్రాలు అందుబాటులో లేవు. ఈ విషయం మీద జయలక్ష్మి మాట్లాడింది. మహిళా సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఇంత చిన్న వయసులోనే సమాజాన్ని బాగు చేయాలి అనే ఉద్దేశంతో తన వంతు కృషి చేస్తోంది. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక సమాజ సంక్షేమం కోసం, సమాజాన్ని మెరుగుపరచడం కోసం ఇంకా ఎన్నో పనులు చేయాలి అని ఆకాంక్షిస్తోంది.

watch video :

To watch the video, Click on “Watch on YouTube”

ALSO READ : “ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తాం… అంబానీ హోటల్ అయినా కూడా..!” అంటూ… “నెగిటివ్ కామెంట్స్” పై కీర్తి భట్ భర్త రియాక్షన్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like