Ads
ఎన్నో ఆటంకాలు వచ్చినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళచ్చు అనుకుంటాం. మానసికంగా ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని మన సంకల్పబలంతోనో.. మనోధైర్యంతోనో మనం అధిగమించవచ్చు. మరి శారీరక సమస్యల పరిస్థితి ఏంటి..? కొంతమంది పుట్టుకతోనే అవయవలోపంతో జన్మించిన వారు ఉంటారు. వారిలో కూడా కుంగిపోకుండా జీవితంలో విజయం సాధించే దిశగా ముందుకు వెళ్ళేవాళ్ళని చూస్తూనే ఉంటాం.
Video Advertisement
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న రాధికా గుప్తారాధికా గుప్తా కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. ఒకప్పుడు జాబ్ రాకపోయేసరికి జీవితాన్ని ముగించేయాలనుకున్న ఆమె.. నేడు చిన్న వయసులోనే సీఈఓ పదవి చేపట్టిన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు.
రాధికా గుప్తా పుట్టుకతోనే వంకర మెడతో జన్మించారు. కెరీర్ ప్రారంభంలో ఆమె ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అవయవలోపం కారణంగా ఎన్నో ఉద్యోగాలను ఆమె కోల్పోవాల్సి వచ్చింది. ఇరవై రెండేళ్ల వయసులోనే ఉద్యోగం దొరక్క విరక్తి చెందిన ఆమె తన జీవితాన్ని చాలించాలనుకుంది. అయితే.. ఆమె స్నేహితులు ఆమెను కాపాడడంతో ఆమె బతికి బట్టకట్టారు. చిన్నతనం నుంచే అవయవలోపం కారణంగా రాధికా గుప్తా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.
ఆమె తండ్రి దౌత్యవేత్త కావడంతో ఆమె పలు చోట్ల పెరిగారు. పాకిస్తాన్, న్యూ ఢిల్లీ, న్యూయార్క్ లలో పెరిగిన ఆమె తరువాత నైజీరియా కు వెళ్లాల్సి వచ్చింది. ఇలా ఆమె చదువుకు రకరకాల ప్రాంతాలలో కొనసాగింది. నైజీరియాలో ఆమె చదువుకున్న స్కూల్ లోనే ఆమె తల్లి కూడా పనిచేసేవారు. ఆమె తల్లి చాలా అందగత్తె. అయితే రాధికా గుప్తాకు ఉన్న అవయవలోపం కారణంగా అందరు ఆమెని తల్లితో పోలుస్తూ గేలి చేసేవారు. ఇలా ఆమె కాన్ఫిడెన్స్ చాలా వరకు దెబ్బతింది. అభద్రతా భావాల మధ్య పెరిగిన ఆమె ఉద్యోగం చేయాలనుకున్నా.. అందులో కూడా ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనితో ఆమె కిటికీలోంచి కిందకు దూకేశారు. అయితే.. ఆమె స్నేహితురాలు కాపాడింది.
కానీ, కాళ్ళు విరగడంతో నాలుగు చక్రాల కుర్చీకి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మానసిక ఒత్తిడికి చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలో వచ్చిన ఒక్క అవకాశమే నా జీవితాన్ని మలుపుతిప్పింది. ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి ఇంటర్వ్యూకు వెళ్లారు. అప్పుడే రాధికా గుప్తాకు మెకెన్సీలో జాబ్ వచ్చింది. కానీ మూడేళ్ళ తరువాత ఆర్ధిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు వచ్చాయి.
అప్పుడే దేశం మారాలని అనుకున్నారు. పాతికేళ్ల వయసులో.. భర్త సాయంతో భారత్ కు వచ్చారు. భారత్ లో సొంతంగా అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థను ప్రారంభించారు. కొన్నేళ్ళకి ఈ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ సీఈఓ కోసం చూస్తున్న టైములోనే రాధికా భర్త ఆమెని ప్రోత్సహించారు. అలా.. ఆమె ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థకు సీఈఓ అయ్యారు. ఒకప్పుడు నాలోపాన్ని చూసుకుని బాధపడేదాన్నని.. అలా ఎవ్వరూ బాధపడకూడదనే.. లిమిట్ లెస్ పుస్తకాన్ని రాశానని రాధికా గుప్త చెప్పుకొచ్చారు.
End of Article