అల్కా మిట్టల్: ఈ పేరే ఇప్పుడు ఒక సెన్సేషన్… చరిత్ర తిరగరాసిన ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

అల్కా మిట్టల్: ఈ పేరే ఇప్పుడు ఒక సెన్సేషన్… చరిత్ర తిరగరాసిన ఆమె గురించి ఈ విషయాలు తెలుసా.?

by Megha Varna

Ads

ఈ మధ్య మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా వుంటున్నారు. ఎందులోనూ తక్కువ కాదు అని మహిళలు అన్నింట్లో ముందుంటున్నారు. ఈమె మహిళా చరిత్రనే తిరగ వ్రాసింది. ఆమె ఎవరో కాదు ఓఎన్‌జీసీ సీఎండీ డాక్టర్‌ అల్కా మిట్టల్‌. ఒక మహిళ ఓఎన్‌జీసీ లో సీఎండీ గా పని చేయడం ఇదే మొట్ట మొదటిసారి. అయితే ఎవరు ఈమె…?, ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమె గురించి తెలుసుకోవాలని అంతా అనుకుంటున్నారు.

Video Advertisement

మరి ఆమె కి సంబంధించి పలు విషయాలని మనం ఇప్పుడు చూద్దాం. డాక్టర్ ఆల్కా మిట్టల్ వయసు 56. ఆమె జనవరి 1న సీఎండీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈమె 1983లో ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేశారు. 2001లో ఈమె పీహెచ్డీ పట్టా తీసుకున్నారు.

ఓఎన్‌జీసీ సంస్థలో ఈమె 2018 నుంచి హెచ్ఆర్ డైరెక్టర్ గా పని చేశారు. 1985 లో గ్రాడ్ ట్రైనీ గా అల్కా మిట్టల్‌ గారు చేరారు. అప్పటి నుండి వివిధరకాల పోస్టుల్లో ఆమె పనిచేశారు. ఆమె కి ఎంతో గొప్ప అనుభవం ఉంది.

అదే విధంగా ఉత్తరాది రీజియన్‌కు చెందిన ‘ఫోరమ్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ద పబ్లిక్‌ సెక్టార్‌’ ప్రెసిడెంట్‌గా మహిళలకు పని వాతావరణం ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిపై ఆమె తన సూచనల్ని, సలహాలని చెప్పారు. దేశంలో ఉన్న అన్ని ఓఎన్‌జీసీ శాఖల్లో పని చేసే వాళ్లకు ఒకేరకమైన తర్ఫీదు అవసరం అని ఆమె దీనిని స్టార్ట్ చేసారు.

అయితే సీఎండీగా నియమించడానికి ముందు ఇంటర్వ్యూ జరిగింది. అందులో 9 మందిని కంపెనీ ఇంటర్వ్యూ చేసింది. వీరిలో ఐఏఎస్లు కూడా ఉన్నారు. అయినప్పటికీ అల్కా మిట్టల్‌ గారు ఎంపికవ్వడం ఎంతో గొప్ప విషయం. గ్లాస్ సీలింగ్ బ్రేక్ చేసిన అతి కొద్ది మంది మహిళల జాబితాలో అల్కా మిట్టల్‌ గారు ఉన్నారు. ఏదిఏమైనా మహిళలు అంతగా ఆసక్తి చూపించని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అల్కా మిట్టల్‌ గారు అడుగు పెట్టడం అనేది మెచ్చుకోదగ్గ విషయం.


End of Article

You may also like