కాలేజీలో తనకు ఎదురైన సమస్యలు ఇతరులకు ఉండకూడదని…సుధామూర్తి గారు ఏం చేసారో తెలుసా?

కాలేజీలో తనకు ఎదురైన సమస్యలు ఇతరులకు ఉండకూడదని…సుధామూర్తి గారు ఏం చేసారో తెలుసా?

by Anudeep

గొప్ప ధనవంతులైనంత మాత్రానా వాళ్ల వ్యక్తిత్వం గొప్పగా ఉంటుందని ఆశించలేం.. ప్రపంచ నెం.1 కుబేరులు అనగానే అంబాని పేరు గుర్తొస్తే రిలయన్స్, జియో, ముంబైలో వారి విశాలవంతమైన బిల్డింగ్, వారి వ్యాపార సామ్రజ్యం మాత్రమే గుర్తొస్తుంది..కానీ మద్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సుధా మూర్తి దంపతులు అంచెలంచెలుగా ఎదిగి సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వారు చేస్తున్న సేవాకార్యక్రమాలు చాలా స్పూర్తివంతమైనవి..వాటిల్లో మచ్చుకు కొన్ని..

Video Advertisement

సుధామూర్తి గారు ఇంజినీరింగ్ చదివే రోజుల్లో తను చదువుకున్న కాలేజిలో సరైన టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు.. తను పడిన ఇబ్బంది దేశంలో అమ్మాయిలు ఎదుర్కోకూడదని తన వంతుగా సాయం చేస్తున్నారు సుధామూర్తి.ఇప్పటివరకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 16000 టాయిలెట్స్ ని విద్యార్ధినుల కోసం కట్టించారు సుధా మూర్తి.

అంతేకాదు తన జన్మస్థలం అయిన కర్ణాటకలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ,కంప్యూటర్ రూం ఏర్పాటుకి సాయం చేస్తున్నారు. . తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్దులకు కావలసిన పుస్తకాలు ఇతరత్రా వస్తువులు అందించి సాయం చేస్తున్నారు. పేద విద్యార్దుల్లో  అక్షరాస్యత పెంపొందించేలా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు.చిన్నపిల్లలకు ఆహారాన్ని అందించే అక్షయపాత్ర ఫౌండేషన్ కి సాయం చేయడమే కాదు, తెలంగాణాలో లక్షల మంది పిల్లలకు ఒకేసారి వంట చేయగల అధునాతన వంటశాలని నిర్మించడానికి సాయం చేశారు.

భారతదేశంలో వైద్యరంగం అభివృద్ది చెందాలని, పేదవారికి అధునాతన వైధ్యం అందాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికి వరకు 50 కోట్లు విరాళం ఇచ్చారు. అంతేకాదు బెంగళూరులోని మెంటల్ అండ్ న్యూరోసైన్సెస్ హాస్పిటల్ కి ధర్మశాలల పేరటి విశ్రాంతి గృహాలను కట్టించి ఇచ్చారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆద్వర్యంలో హాస్పిటల్స్ కి మందులు,ఇతరత్రా వైద్య పరికరాలను విరాళంగా ఇచ్చారు…ఇప్పటికి ఇస్తున్నారు.

పుల్వామా ఘటనలో మరణించిన 40మంది సైనికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10లక్షల చొప్పున ఆర్ధిక సాయం చేశారు. అంతే కాదు దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికుల కుటుంబాలకు సాయంగా ప్రతి సంవత్సరం కొంత డబ్బు ఖర్చుపెడుతున్నారు.

సేవ చేయాలనే సంకల్పం ఉంటే సరిపోదు..చేసే సేవ సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలను దూరం చేసేదిగా ఉండాలనేది సుధామూర్తి దంపతులను గమనిస్తే మనకి అర్దం అవుతుంది..


You may also like