నేను నేర్చుకున్న పాఠాలు ఇవే అంటూ.. ఇంస్టాగ్రామ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక..!!

నేను నేర్చుకున్న పాఠాలు ఇవే అంటూ.. ఇంస్టాగ్రామ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నిహారిక..!!

by Sunku Sravan

Ads

నటుడు నాగబాబు కూతురు కొణిదెల నిహారిక అంటే తెలియని వారు ఉండరు. ఆమె ఇప్పటికే హోస్ట్ గా బుల్లితెర మీద నటిగా తన జీవితాన్ని మొదలు పెట్టింది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నిర్మాతగా చేసింది. హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించి అంతగా గుర్తింపు దక్కకపోవడంతో పక్కకు తప్పుకుంది. తర్వాత ఎక్కువగా డిజిటల్ మరియు బుల్లి తెర మీదనే ఫోకస్ పెట్టేసింది.

Video Advertisement

 

అయితే నిహారిక రెండు సంవత్సరాల కిందట జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నిహారిక గత రెండు వారాల నుండి ఎలాంటి పోస్టులు చేయడం లేదు. దానికి కారణాలు కూడా అందరికీ తెలిసిందే. ఇటీవల జిమ్ వీడియో షేర్ చేయడంతో దానిపై విపరీతంగా ట్రోలింగ్ జరిగాయి.. దీంతో నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని డిలీట్ కూడా చేసింది.

అప్పట్లో ఈ వార్త పెద్ద సెన్సేషనల్ గా మారింది. ఈ తరుణంలోనే హైదరాబాద్ ఒక పబ్ లో జరిగిన రేవ్ పార్టీ మీద పోలీసులు దాడి చేయడంతో ఆ సమయంలో నిహారిక అక్కడ ఉండడం పోలీసులకు చిక్కడం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో నిహారిక కొణిదెల పై చాలా నెగిటివ్ వార్తలు కూడా వచ్చాయి ఈ క్రమంలోనే ఆమె చాలా సైలెంట్ గా ఉంటూ వచ్చింది. అయితే ప్రస్తుతం మళ్లీ తన ఇంస్టాగ్రామ్ రి ఓపెన్ చేసింది.

ఈ సందర్భంలో ఆమె చేసిన ఈ పోస్టు చాలా వైరల్ అవుతోంది. ఎనిమిది వారాల లాంగ్ టైం తర్వాత తాను 3 పాఠాల నేర్చుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ఈ విధంగా తన ముఖాన్ని చూపించకుండా ఉండేటటువంటి ఒక ఫోటోను షేర్ చేసింది. దీనిపై చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తో పాటుగా పలువురు లైక్ చేశారు. వెల్కమ్ నిహారిక నిన్ను చాలా రోజుల నుంచి మిస్ అయ్యాను అంటూ నెటిజన్ కామెంట్స్ పెడుతున్నారు.

https://www.instagram.com/p/Cc-W_YspE2F/?utm_source=ig_web_button_share_sheet

 


End of Article

You may also like