ఒకే ఒక్క డైలాగ్ తో కంటతడి పెట్టించింది… సెలబ్రిటీలతో శభాష్ అనిపించుకుంది..! ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

ఒకే ఒక్క డైలాగ్ తో కంటతడి పెట్టించింది… సెలబ్రిటీలతో శభాష్ అనిపించుకుంది..! ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

సోషల్ మీడియాలో అటు ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఇటు మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. సరిగ్గా వాడితే సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రతిభ బయటకు వస్తుంది. చాలా మంది తమకి సరైన అవగాహన లేని కారణంగా, లేదా మరేదో కారణంగా వారి టాలెంట్ చూపించుకునే అవకాశం దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉండి కూడా ప్రపంచానికి చూపించలేకపోయాము అని బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి సోషల్ మీడియా అనేది ఒక మాధ్యమం లాగా ఉపయోగపడుతుంది.

Video Advertisement

instagrammer who recreated murari scene

సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయమైన టాలెంటెడ్ ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంత మంది ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఒక యువతి గురించి అలాగే మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమా మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ సినిమాలో ప్రస్తావన వస్తే ముందు ఉండే సినిమా. ఇందులో మహేష్ బాబు పాత్రతోపాటు సినిమాకి హైలైట్ అయిన మరొక పాత్ర లక్ష్మీ గారి పాత్ర. మహేష్ బాబు పాత్ర అయిన మురారిని తన సొంత కొడుకు లాగా చూసుకుంటారు. లక్ష్మీ గారి భర్త పాత్రలో ప్రసాద్ రావు గారు నటించారు.

instagrammer who recreated murari scene

లక్ష్మీ గారిది ఈ సినిమాలో ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది. తన పెళ్లయి వచ్చినప్పుడు మురారి ఎలా ప్రవర్తించాడు అని చెప్తూ లక్ష్మీ గారు ఎమోషనల్ అవుతారు. ఈ విషయాన్ని చాటుగా వింటున్న మురారి కూడా ఎమోషనల్ అవుతాడు. వాళ్లు మాత్రమే కాదు. సినిమాలో ఈ సీన్ చూస్తున్నప్పుడు కంటతడి పెట్టుకొని ప్రేక్షకులు ఉండరు. మణిశర్మ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కృష్ణవంశీ గారి డైరెక్షన్, నటీనటుల నటన, ఇవన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ సీన్ గా ఇది నిలిచింది. ఇలాంటి సీన్ ని, అందులోనూ లక్ష్మీ గారి పర్ఫార్మెన్స్ ని మళ్లీ ఎవరైనా క్రియేట్ చేయడం అంటే సాహసం.

instagrammer who recreated murari scene

అసలు ఎవరి వల్ల కూడా కాదు. లక్ష్మీ గారు అంత గొప్పగా నటించారు. కానీ ఒక అమ్మాయి లక్ష్మీ గారు చేసినంత బాగా చేసి ఇంస్టాగ్రామ్ లో ఒక రీల్ షేర్ చేసింది. ఎంతో మంది సెలబ్రిటీలు ఆ అమ్మాయి రీల్ కి కామెంట్స్ పెట్టారు. అమ్మాడి 0786 పేరుతో ఈ అమ్మాయి ఇంస్టాగ్రామ్ ఐడి ఉంది. కొన్నాళ్ల క్రితం ఈ వీడియో షేర్ చేసింది. బాలాదిత్య, హిమజ, సింగర్ రేవంత్, మై విలేజ్ షో అనిల్ తో పాటు ఇంకా ఎంతో మంది కామెంట్స్ పెట్టారు. ఈ అమ్మాయి వీడియో చూస్తే ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు. అంత బాగా నటించింది.

watch video :

ALSO READ : పుష్ప “రష్మిక” నుండి… లైగర్ “అనన్య పాండే” వరకు… ఇటీవలి కాలంలో ప్రేక్షకులకి చిరాకు తెప్పించిన 10 హీరోయిన్ పాత్రలు..!


End of Article

You may also like