ఎవరీ రాధికా మర్చంట్? అంబానీ ఇంటికి కోడలు కాబోతున్న ఈ అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?

ఎవరీ రాధికా మర్చంట్? అంబానీ ఇంటికి కోడలు కాబోతున్న ఈ అమ్మాయి గురించి ఈ విషయాలు తెలుసా?

by Anudeep

Ads

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఈ అమ్మాయి గురించి పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. అంబానీకి కాబోయే కోడలు ఇటీవలే భరత నాట్యంలో అరంగ్రేటం చేసారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు అయ్యారు. దీనితో.. ఒక్కసారిగా మీడియా చూపు ఆమె వైపు పడింది.

Video Advertisement

అంబానీ దేశ ధనికుల్లో ఒకరన్న సంగతి తెలిసిందే. 99.7 బిలియన్ డాలర్ల  సంపద కలిగి.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అంబానీ నిలిచారు. మరోవైపు ప్రపంచ కుబేరుల జాబితాలో కూడా ఎనిమిదవ స్థానంలో ఉన్నారు.

radhika merchant 1

తాజాగా అంబానీ కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారు. ఆమె ఎవరో కాదు. రాధికా మర్చంట్. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీని ఆమె త్వరలోనే వివాహం చేసుకోనున్నారట. త్వరలోనే రాధికా అంబానీ కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఈ రాధికా మర్చంట్ ఎవరు అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ విరెన్ మర్చంట్, శైలా మర్చంట్ ల కూతురే రాధికా మర్చంట్.

radhika merchant 2

ఆమె తన పాఠశాల విద్యను ముంబైలో పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత న్యూయార్క్ లో పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ చదువుని పూర్తి చేసారు. విరేన్ మర్చెంట్ కుటుంబానికి అంబానీ కుటుంబంతో చాలా కాలం గానే పరిచయాలు ఉన్నాయి. 2018 లో ముకేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ వివాహ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రాధికా మర్చంట్ కూడా వేడుకల్లో సందడి చేసారు. రాధికా మర్చంట్ కు శాస్త్రీయ నృత్యం అంటే ఇష్టం ఉంది.

radhika merchant 3

ఆ ఇష్టం తోనే ఆమె శ్రీ నిభా ఆర్ట్స్ లో గురు భావనా ​​థాకర్ ఆధ్వర్యంలో భారత శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించారు. తాజాగా.. అత్తమామల సమక్షంలో భరతనాట్యం లో అరంగ్రేటం చేసారు. దీనితో ఒక్కసారిగా రాధికా మర్చంట్ ఫేమ్ లోకి వచ్చారు.


End of Article

You may also like