కెజిఎఫ్ లో జూనియర్ యష్ గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

కెజిఎఫ్ లో జూనియర్ యష్ గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

by Anudeep

Ads

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు?

Video Advertisement

మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. అయితే… ఈ సినిమాలో ఇతర పాత్రలకి చాలా గుర్తింపు లభించింది. అలాగే.. ఈ సినిమాలో జూనియర్ యష్ గా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా పాపులర్ అయ్యాడు.

anmol 2

ఇంతకీ అతను ఎవరో.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యష్ టీనేజ్ ఏజ్ లో ఉన్నప్పుడు.. అతని ఫ్లాష్ బ్యాక్ సీన్లు బాగా పండాయి. అయితే.. ఈ సీన్లలో జూనియర్ యష్ గా ఆర్టిస్ట్ అన్మోల్ విజయ్ బత్కల్ కనిపిస్తాడు. అన్మోల్ వయసు 18 సంవత్సరాలు. చదువు పై కూడా దృష్టి పెట్టిన అన్మోల్ కెజిఎఫ్ సినిమాలో తన యాక్టింగ్ తో అందరి మెప్పు పొందాడు. అయితే… అన్మోల్ కూడా నటించడం కంటే డాన్స్ చేయడమంటే బాగా ఇష్టమట. స్టంట్ లు చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాడు.

anmol 1

అన్మోల్ సోషల్ మీడియా ఖాతాలు చూస్తే అందులో ఎక్కువగా డాన్స్ వీడియోలు, స్టంట్ వీడియోలే కనిపిస్తాయి. చిన్నతనం నుంచే డాన్స్ పై ఇంటరెస్ట్ ఉండడం వలన అన్మోల్ డాన్స్ స్టంట్ లు చేయడంలో ప్రత్యేక శిక్షణను కూడా తీసుకున్నాడట. కెజిఎఫ్ సినిమా కంటే ముందు కూడా అన్మోల్ కొన్ని కన్నడ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అలా కెజిఎఫ్ సినిమాలో కూడా అవకాశం లభించింది.  అయితే.. కెజిఎఫ్ సినిమాతో మాత్రం అన్మోల్ కు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లభించింది.

 


End of Article

You may also like