Ads
భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సక్సెస్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. అయితే ఎప్పుడైనా సరే మనం ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఎలాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తికి అయినా సరే ఆ స్థానం అంత సులభంగా రాదు. మధ్యలో కొన్ని ఇబ్బందులు అలాగే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Video Advertisement
అలా ఎంతో మందికి స్పూర్తినిచ్చిన సక్సెస్ స్టోరీల్లో రతన్ టాటా గారిది కూడా ఒకటి. ఎనభై నాలుగేళ్ళ వయసు, లక్షల కోట్లకి అధిపతి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వ్యాపార సామ్రాజ్యం.
అటువంటి రతన్ టాటా గారికి ఓ సోదరుడు ఉన్నారన్న సంగతి తెలుసా..? చాలా మందికి ఈ విషయం తెలియదు. రతన్ టాటా గారికి ఒక సొంత సోదరుడు ఉన్నారు. ఆయన పేరు జిమ్మీ టాటా. ఆయన చాలా లో ప్రొఫైల్ ని మైంటైన్ చేస్తారు. ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఏ మీడియా ముందుకు రావడానికి ఆయన ఇష్టపడరు. టాటా గ్రూప్ హై ప్రొఫైల్ లో ఉండే వ్యక్తుల్లోనే చాలా మందికి రతన్ టాటాకు ఓ సొంత సోదరుడు ఉన్నారన్న విషయం తెలియదు. కనీసం ఆయన ఎలా ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. ఆయన అంత నిరాడంబరంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
ముంబైలో కొలబా అపార్ట్మెంట్ లో ఆరో ఫ్లోర్ లో ఓ టూ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటారు. రతన్ టాటా కూడా అదే అపార్ట్ మెంట్ లో ఉంటారు. అయితే ఆయన తమ్ముడు జిమ్మీ టాటా ఇంటి తలుపులు మాత్రం ఎప్పుడు వేసే ఉంటాయట. ఆయన ఎప్పుడో కానీ బయటకు రారట. అసలు ఇప్పటివరకు ఆయన దగ్గర ఒక ఫోన్ కూడా లేదట. అలా అని ఆయనకు టాటా సంస్థలో ఏమి జరుగుతుందో తెలియదు అనుకుంటే పొరపాటే. ఆయనకు అన్ని విషయాలు తెలుస్తాయట.
వార్తాపత్రికల్లో టాటా సంస్థకు సంబంధించిన అన్ని కథనాలను కలెక్ట్ చేసుకుని ఓ అంచనాకి వస్తూ ఉంటారట. ఆయన లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారన్న మాటే కానీ.. మిగతా అన్ని విషయాల్లోనూ ఆయన ముందుంటారు. టాటా మోటర్స్, టిసిఎస్, టాటా కెమికల్స్, టాటా స్టీల్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్ వంటి చాలా సంస్థల్లో ఆయనకు షేర్లు ఉన్నాయి. టాటా ఫౌండేషన్ లో ఆయన ఒక ట్రస్టీగా కూడా ఉన్నారు.
వ్యక్తిగతంగా ఆయనకు ఎంత ఆస్తిపాస్తులున్నా.. ఆయన చాలా నిరాడంబర జీవితాన్ని గడుపుతారు. ఆయనకు స్క్వాష్ ఆడటం ఇష్టం. అదే ఆయన వ్యాపకం. ఆయనకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. గ్రూప్ లో ఏదైనా కలకలం రేగినా.. ఆయన తన అభిప్రాయాలను స్థూలంగా టాటా సన్స్ కు పంపిస్తూ ఉంటారు. ఆయన అంత త్వరగా తెరపైకి రావడానికి ఇష్టపడరు. ఆయన అలా కోరుకుని జీవనం సాగిస్తున్నారు. నిజంగా ఆయన స్టోరీ తెలుసుకుంటున్న కొద్దీ ఆశ్చర్యం కలుగుతోంది కదా..
End of Article