బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ ను సాధించిన నిఖత్ జరీన్ గురించి ఈ విషయాలు తెలుసా..?అంత కష్టపడింది కాబట్టే..?

బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ ను సాధించిన నిఖత్ జరీన్ గురించి ఈ విషయాలు తెలుసా..?అంత కష్టపడింది కాబట్టే..?

by Anudeep

Ads

తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సీనియర్ విభాగంలో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆమె తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టించింది. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ప్రపంచ సీనియర్ విమెన్ బాక్సింగ్ లో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది.

Video Advertisement

గురువారం ఫైనల్స్ జరగగా 52 కేజీల విభాగం (ఫ్లై వెయిట్)లో ఆమె 5-0తో జిట్‌పోంగ్ జుటామస్(థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె విజయాన్ని యావత్ భారత దేశ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది.

nikhat 1

2019 లో కూడా ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తాజాగా ఆమె సీనియర్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిఖత్ జరీన్ తల్లి తండ్రులు మహ్మద్ జమీల్ అహ్మద్ మరియు పర్వీన్‌. నిఖత్ బాక్సింగ్ లో ఈ స్థాయికి చేరగలదని ఆమె తండ్రి జమీల్ 12 సంవత్సరాల క్రితమే ఊహించారు. నిజామాబాద్ సెక్రటేరియట్ స్టేడియంలో నిఖత్ మొదటి బాక్సింగ్ తరగతులు ప్రారంభించి కొన్ని వారాలు మాత్రమే గడిచింది.

nikhat 2

12 ఏళ్ల వయసులో ఉన్న నిఖత్ కు అప్పటికి అనుభవం లేదు. ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆమె తన బాక్సింగ్ ను కొనసాగించింది. ఆ సమయంలో ఆమె ఎడమ కంటిపై గట్టిగా దెబ్బ తగిలి కంటి చుట్టూ నల్లబడింది. అసలే బాక్సింగ్ లోకి వెళ్లడం ఇష్టం లేని నిఖత్ తల్లి పర్వీన్.. నిఖత్ కు గాయం అవడం చూసి కంగారు పడ్డారు. ఆ తరువాత కోపం తెచ్చుకున్నారు. ఇప్పటికే ఇరుగు పొరుగు వారంతా కూతురుని బాక్సింగ్ కి పంపడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారని, ఇంకా ఇలానే కొనసాగితే పిల్లకి ఏమి సంబంధాలు వస్తాయి..? అని ఆమె ఆందోళన చెందేవారు.

nikhat 4

అయితే నిఖత్ తండ్రి జమీల్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించాడు. “పెళ్లి సంబంధాల గురించి ఆలోచించడం మానెయ్. ఏదో ఒక రోజు నా కుమార్తె కారణంగా ప్రపంచం మొత్తం ఒక రోజు మా తలుపు వెలుపల వేచి ఉంటుంది” అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. దాదాపు 12 ఏళ్ల తరువాత అది నిజమైంది. అయితే ఈ పన్నెండేళ్ళలా ఓ ఆడపిల్లగా నిఖత్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి చాలానే కష్టపడాల్సొచ్చింది. 2011 లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ తన విజయాల పయనాన్ని కొనసాగిస్తూ నేడు వరల్డ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ విజేతగా అందరిముందు నిలిచింది.


End of Article

You may also like