Ads
ఎస్పీ బాలు గారి గురించి ఎవరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఆయన సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు. 50 వేలకు పైగా పాటలను పలు భాషల్లో పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది ఆ కంఠం.
Video Advertisement
ఎస్పీ బాలు కేవలం గాయకుడు గానే కాదు సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఈయన 1946 జూన్ 4వ తేదీన జన్మించారు. 2020 సెప్టెంబర్ 25వ తేదీన మరణించారు. కోవేట్ కారణంగా అయిన భౌతికంగా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళినా ఇంకా ఆయన పాటలతో అభిమానుల మదిలో సజీవంగా ఉన్నారు.ఈరోజు ఆయన జయంతి సందర్భంగా సినీ పరిశ్రమ మరియు అభిమానులు ఆయన మధురమైన గాత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన స్నేహితుడైన ఇళయరాజా తో వచ్చిన చిన్న గొడవ తప్ప, వివాదాలకు దూరంగా ఉంటారు. ఎల్లప్పుడూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఉండేవారు.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కేవలం తెలుగు లో కమల్ హాసన్ చిత్రాలకు మాత్రమే ఆయన స్వరాని అందించేవారు. కమలహాసన్ అంతేకాకుండా మరొక నటుడు కూడా ఎస్పీ బాలు గారు తన గాత్రాన్ని అందించారు.అలా ఎస్పీ బాలు వారితో డబ్బింగ్ చెప్పించుకున్న ఆ నటుడు ఎవరో మీకు తెలుసా? ఆయనే నటుడు నాజర్ గారు. నాజర్ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించారు.
నాజర్ నటుడిగా తెలుగులో ఎన్నో చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించారు. నాజర్ మహేష్ బాబుకి తాతయ్యగా అతడు అనే చిత్రంలో నటించారు. నాగర్ పాత్రలకు ఎవరిచేత డబ్బింగ్ త్రివిక్రమ్ గారు ఆలోచించగా ఈ పాత్ర కు ఎస్పీ బాలు గారి వాయిస్ అయితే కరెక్ట్ అని బాలు గారిని సంప్రదించడం జరిగిందట. కమల్ హాసన్ కు తప్ప మరి ఏ పాత్రలకు నేను డబ్బింగ్ చెప్పాను అనే మొండి పట్టుతో ఉండే బాలు గారిని పట్టువీడని విక్రమార్కుడులా అతడు సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి ఒప్పించారు దర్శకుడు త్రివిక్రమ్.
End of Article