అద్భుతాలు జరిగే ముందు ఎవరు గుర్తించారు. జరిగిన తరువాత ఎవరు చెప్పాల్సి న పని ఉండదు. “ఆ నలుగురు” సినిమా కూడా అంతే. మనిషి జీవితానికి విలువలు ఎంత ముఖ్యమో చెప్పే సినిమా. ఇంత మంచి సినిమా కూడా చాలా సార్లు రిజెక్ట్ అయి చివరికి సినిమా గా తెరకెక్కడానికి ఎన్నో కష్టాలు పడాల్సొచ్చిందట. అవేంటో మనం ఇప్పుడు చూసేద్దాం.

Video Advertisement

aa naluguru 2

“ఆ నలుగురు” సినిమా నిజానికి ఒక రియల్ స్టోరీ. మదనపల్లి దగ్గర ఓ వ్యక్తి దహన సంస్కారాలకు డైరెక్టర్ మదన్ హాజరు అయ్యారు. ఊరంతా అప్పులు చేసిన ఆ వ్యక్తి గురించి ఆ ఊరంతా ప్రశంసిస్తోంది. అతని అప్పుల గురించి కాకుండా.. అతని మంచితనం గురించి మాట్లాడడం మదన్ చూసి చలించిపోయాడు. “ఆ నలుగురు” సినిమా కి ఈ సంఘటనే ప్రేరణ. డబ్బు కంటే మనిషి కి విలువలు ముఖ్యం అన్న పాయింట్ లో ఓ కథని రాసుకుని సీరియల్ తీయాలనుకున్నారు. ఈ స్టోరీ కి “అంతిమ యాత్ర” అని పేరు కూడా పెట్టుకున్నారు. ఈ కథ తీసుకెళ్లి ఈటివి వాళ్ళకి చెప్పి సీరియల్ గా తీద్దామన్నారు. కానీ వారు రిజెక్ట్ చేసారు.

aa naluguru 4

అయితే, ఆ కథను వదిలేయలేక భాగ్యరాజా దగ్గరకు తీసుకెళ్లారట. ఆయన తమిళ్, తెలుగు భాషల్లో నేనే తీస్తా అని మాట ఇచ్చారు కానీ.. ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే మదన్ తన ప్రయత్నాలు మానుకోలేదు. ప్రకాష్ రాజ్ ను అడిగారు. అయితే కధంతా విన్న తరువాత ప్రకాష్ రాజ్ ఇది సినిమా గా వర్క్ అవుట్ అవ్వదు అనేసారు. దీనితో ఈ కథ మళ్ళి మరుగున పడింది. ఓసారి ఇదే కథను రాజేంద్ర ప్రసాద్ కు వినిపించారట. అయితే, ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుని ఈ సినిమాని నేనే చేస్తాను అని అడిగారట.

aa naluguru 3

మదన్ తన స్నేహితుడు అయిన చంద్ర సిద్ధార్థ్ సాయం తో ఈ సినిమాను తానె నిర్మించాలని ఫిక్స్ అయిపోయాడు. ఈ కథ కోసం రాజేంద్ర ప్రసాద్ రూపు రేఖలను కూడా మార్చుకున్నారు. ఆమని ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. తొలుత ఈ సినిమా కి “అంతిమ యాత్ర ” టైటిల్ నే ఖరారు చేద్దామనుకున్నారు. కానీ “ఆ నలుగురు” అని టైటిల్ మార్చారు. రూపాయి గురించి ఈ సినిమా లో వచ్చే డైలాగు హైలైట్ అయింది. ఆ మాటకొస్తే.. ఈ సినిమా లో ప్రతి సన్నివేశం ప్రత్యేకం గానే ఉంటుంది. ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేంత సహజం గా ఉంటుంది.

aa naluguru

ఈ సినిమాను కేవలం 38 రోజుల్లో తీసేసారు. దాదాపు 1 కోటి 20 లక్షల బడ్జెట్ ఖర్చు అయింది. ఎలాంటి చప్పుడు లేకుండానే ఈ సినిమా 2004 డిసెంబర్ 25 న విడుదలయింది. మొదటి రెండు వారాలు చూసాక ఈ సినిమా బోల్తా కొట్టిందని అంతా అనుకున్నారు. దాదాపు సగానికి పైగా బాక్సులు వెనక్కి వచ్చేసాయి కూడా. అయితే, అనూహ్యం గా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. డబుల్ రేట్ లాభం కూడా వచ్చింది. ఈ సినిమా కి గాను రాజేంద్ర ప్రసాద్ కు ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. కోట శ్రీనివాసరావు కు కూడా ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు లభించింది.