Ads
ఎన్టీ రామారావు నటించిన బొబ్బిలి పులి చిత్రం రిలీజ్ అయి ఈ నాటికి 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా ఆ చిత్రం అందరి గుండెల్లో నిలిచి ఉంది. బొబ్బిలి పులి సినిమా నేటి తరానికి కూడా ఎన్నో నేర్పింది, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ ఈ సినిమా తో నే మొదలయ్యాయి అని చెప్పొచ్చు.
Video Advertisement
కానీ ఈ చిత్రంలోని సన్నివేశాలన్నీ అప్పటి ఇందిరాగాంధీ గవర్నమెంటుకి విరుద్ధంగా ఉన్నాయని భావించిన మద్రాస్ రీజినల్ కమిటీ సెన్సార్ బోర్డు వారు చిత్రంలో ఎన్టీఆర్ కి సంబంధించిన చాలా సీన్స్ తొలగించాలి అని రిపోర్ట్ ఇచ్చారు.
రివైజింగ్ కమిటీని అప్రోచ్ అయిన డైరెక్టర్ దాసరి మరియు ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ కు కమిటీ చైర్మన్ ఎల్.వి.ప్రసాద్ చిత్రం క్లైమాక్స్ తొలగించవలసిందిగా రివ్యూ ఇచ్చారు. అది నచ్చని వారు ఢిల్లీలోనే తేల్చుకుంటామని అక్కడ నుంచి గమ్ముగా నిష్క్రమించారు. అవసరమైతే సినిమా రిలీజ్ కోసం దాసరి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధపడ్డారు.
“ఈ చిత్రంలోని ” జననీ జన్మభూమిశ్చ…”పాట ఈరోజుకి విన్నవారి నరాల్లో దేశభక్తితో నెత్తురు ఉరకలెత్తుతుంది. అలాంటి అత్యుత్తమమైన సినిమా రిలీజ్ కు ప్రతిబంధకాలు ఏర్పడ్డాయని తెలుసుకున్న నటుడు ప్రభాకర్ రెడ్డి వడ్డే రమేష్ తో కలిసి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీ చేరిన వెంటనే ఆయన ఒక 18 తెలుగు తమిళ ఐఏఎస్ ఆఫీసర్లకు ఈ చిత్రం షో వేసి చూపించారు. చిత్రం ఎక్సలెంట్ గా ఉంది దీనికి కట్స్ అవసరం లేదు మా సపోర్ట్ మీకు ఇస్తాము అని వాళ్ళ దగ్గర మాట తీసుకున్నారు.
ఆ తరువాత పీవీ నరసింహారావు గారికి , పెండికంటి వెంకటసుబ్బయ్య గారికి,జనరల్ కృష్ణ రావు మరియు అప్పటి డిప్యూటీ సీఎం జగన్నాధరావు లకు ఈ చిత్రాన్ని వేసి చూపించారు. అందరికీ ఆ చిత్రం నచ్చడంతో ఈ విషయాన్ని మేము చూసుకుంటామని వాళ్లు అభయమిచ్చారు. అక్కడికి సగం ఇబ్బంది దూరం చేసిన ప్రసాద్ రెడ్డి మద్రాస్ లో ఉన్న దాసరి కి ఫోన్ చేశాడు.
“మీరు వెంటనే ఢిల్లీకి బయలుదేరి రండి ఇంకో ఒక్కళ్ళకు ఈ చిత్రం చూపిస్తే మనకున్న అడ్డంకులన్నీ తీరిపోతాయి”అన్నారు ఫోన్ లో. దానికి దాసరి ఆ ఒక్కరు ఎవరు అని ప్రశ్నించగా ప్రసాద్ రెడ్డి అప్పటి ప్రెసిడెంట్ నీలం సంజీవరెడ్డికి ఆ చిత్రాన్ని చూపించాలి అన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వెంటనే దాసరి ఢిల్లీ చేరుకున్నారు. నీలం సంజీవరెడ్డి గారు ఈ సినిమాని ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్ లో వీక్షించారు. స్వయంగా రాష్ట్రపతి సినిమా బాగుంది అని సర్టిఫికెట్ ఇచ్చిన తరువాత సెన్సార్ బోర్డుల వాళ్ళ కత్తర్లు అన్ని తిరిగి డ్రాయర్ సరుగుల్లోకి భద్రంగా చేరుకున్నాయి. జులై 9 1982న రిలీజ్ అయిన బొబ్బిలి పులి కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ కు పోటీగా ఎవరు నిలబడలేరు అని మరోసారి నిరూపించిన చిత్రం బొబ్బిలి పులి.
End of Article