“మాటే మంత్రము, ఆడదే ఆధారం” ఫేమ్ “పల్లవి” గురించి ఈ 5 విషయాలు తెలుసా?

“మాటే మంత్రము, ఆడదే ఆధారం” ఫేమ్ “పల్లవి” గురించి ఈ 5 విషయాలు తెలుసా?

by Mohana Priya

Ads

తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల నుండి హీరోయిన్ గా నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు పల్లవి రామిశెట్టి. ఇటీవల జీ తెలుగులో వచ్చే మాటే మంత్రం సీరియల్ లో వసుంధర పాత్రలో నటించి అందరినీ అలరించారు పల్లవి. పల్లవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

#1 పల్లవి ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న ఊరిలో జన్మించారు. ఉద్యోగరీత్యా పల్లవి తండ్రి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారట. దాంతో పల్లవి కూడా బెంగళూరు లో పెరిగారు. చాలా మంది లాగానే పల్లవి కూడా పెద్దయిన తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నారట.

#2 పల్లవి రామిశెట్టి ఒక తెలుగు కుటుంబానికి చెందినవారు. పల్లవి చదువుకుంటున్నప్పుడు తన తండ్రి స్నేహితుడి సలహా మేరకు ఒక ఆడిషన్ ఇచ్చారట. ఆ ఆడిషన్ లో పల్లవి సెలెక్ట్ అయ్యారట. అప్పటివరకు నటన గురించి, ఇండస్ట్రీ గురించి పల్లవి కి ఏమీ తెలియదట. తన కుటుంబం ఇంకా స్నేహితుల ప్రోత్సాహంతో పల్లవి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

#3 పల్లవి నటించిన మొదటి సీరియల్ రంగుల కల. 2009 సంవత్సరంలో పల్లవి నటించిన భార్యమణి, ఆడదే ఆధారం సీరియల్స్ తనకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. దాంతో పల్లవికి అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ పల్లవి తల్లిదండ్రులు తనని ముందు చదువు పూర్తి చేయమని చెప్పడం తో హైదరాబాద్ లో తన చదువు పూర్తి చేశారు పల్లవి.

#4 తర్వాత మాటే మంత్రము, అత్తారింటికి దారేది, సీరియల్స్ లో కూడా నటించారు పల్లవి. అంతేకాకుండా తన నటన కి రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు కూడా అందుకున్నారు.

#5 పల్లవికి హీరో సూర్య అంటే చాలా ఇష్టమట. సూర్య నటనను, ప్రతి పాత్రకి సూర్య కష్టపడే తీరును పల్లవి ఎంతగానో అభిమానిస్తారట. 2019లో దిలీప్ కుమార్ ని పెళ్లి చేసుకున్నారు పల్లవి.

ఇవి పల్లవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. భవిష్యత్తులో కూడా ఇలానే మంచి పాత్రలు చేస్తూ మనందరినీ అలరించాలి అని ఆశిద్దాం.


End of Article

You may also like