Ads
ప్రముఖ కార్డియాలజిస్ట్, ఎంట్రప్రెన్యూయార్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న తరువాత రామ్ చరణ్ అభిమానులకు కూడా ఆమె ఫేవరెట్ అయిపొయింది. రామ్ తో వివాహం అయిన తరువాతే ఆమెకు ఎక్కడ లేని పాపులారిటీ వచ్చినా, కేవలం రామ్ చరణ్ వైఫ్ గా కాకుండా, తనకంటూ ప్రత్యేక స్టార్ డమ్ ను సంపాదించుకుంది.
Video Advertisement
భిన్నమైన వ్యక్తిత్వం, సామాజిక సేవపై ఆమె కు ఉన్న దృక్పధం ఆమెను ప్రత్యేకం గా నిలబెట్టాయి. రామ్ చరణ్ భార్య గా, మెగా స్టార్ కోడలు గానే కాకుండా ఉపాసన అంటే ఫాన్స్ కు ప్రత్యేక అభిమానం ఉంది. ఓ వైపు అపోలో వ్యవహారాలు చూసుకుంటూ.. మరో వైపు ఫ్యాషన్ ప్రపంచం లో కూడా ఉపాసన తనదైన ముద్ర వేశారు. ఆమె కు ఒక బ్రదర్ , ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఉపాసన సిస్టర్ అనుష్పల కూడా చూడడానికి ఇంచుమించు ఉపాసన లానే ఉంటారు. వీరిద్దరికి ట్రెండీ గా కనిపించడం అంటే చాలా ఇష్టం.
ఉపాసన సిస్టర్ అనుష్పల బిజినెస్ మానేజ్మెంట్ లో డిగ్రీ చేసారు. అపోలో ఫార్మసీ హెడ్ గా అనుష్పల ఉన్నారు. దేశవ్యాప్తం గా ఉండే ఔట్లెట్ ల బిజినెస్ ను అనుష్పల చూసుకుంటుంటారు. టాలీవుడ్ సెలెబ్రిటీల పెళ్లిళ్లు, ఇతర బిజినెస్ వర్గాల ఫంక్షన్లలో కూడా అనుష్పల కనిపిస్తూనే ఉంటారు. ఏ సెలబ్రిటీ మ్యారేజ్ ఫంక్షన్ లో అయినా అనుష్పల చాలా అందంగా కనిపిస్తారు. మెగా ఫామిలీ లో ఆమె కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్రైడ్ గా కనిపిస్తారు. ఆమె ఎక్కడకి వెళ్లినా, పెళ్లి ఎప్పుడు? అని అడిగేవారు కూడా ఎక్కువ గానే ఉంటారట. అయితే.. ఆమె మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ తో తొందరలోనే అని చెప్తూ ఉంటారట. ఈ విషయం అలా ఉంచితే, బిజినెస్ పరం గా ఉపాసన సిస్టర్ అనుష్పల చాలా బిజీ గా ఉన్నారు.
ఇంకా, అనుష్పల కు తన బావ రామ్ చరణ్ సినిమాలన్నా, చినమామగారైన పవన్ కళ్యాణ్ సినిమా అంటే కూడా చాలా ఇష్టమట. వారి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా తప్పకుండ చూస్తుందట. పవన్ సినిమాలను వదలకుండా చూస్తుందట. ప్రస్తుతం, అనుష్పల పెళ్లి విషయమై పలు వార్తలు వినిపిస్తున్నా, ఆమె తన దృష్టాంతా కెరీర్ పైనే పెట్టినట్లు కనిపిస్తుంది.
End of Article