నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన చిత్రం ‘దసరా’ రీసెంట్ గా భారీ అంచనాల మధ్య మార్చి 30న రిలీజ్ అయ్యింది. ఈ చితానికి కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.

Video Advertisement

ఈ మూవీలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించారు. థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. నాని ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ గురించి తాజాగా ఒక అప్ డేట్ నెట్టింట్లో షికారు చేస్తోంది. అది ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భారీ అంచనాలతో రిలీజ్ అయిన నాని ‘దసరా’ మూవీ అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్స్ తో అదరగొట్టింది. ఈ చిత్రం నాని కెరీర్ లోనే మంచి ఒపెనింగ్స్ సాధించింది. అంతే కాకుండా ఓవర్సీస్ ప్రీమియర్స్‌తోనే ఈ చిత్రం 2 మిలియన్‌ డాలర్స్‌ను వసూల్ చేసి, నాని కెరీర్‌లో రికార్డ్ సృష్టించింది. వసూళ్ల పరంగా 100 కోట్ల క్లబ్బులో చేరింది. తాజాగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలా ఉంటే నాని తన 30వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ మూవీ టైటిల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
సోషల్ మీడియాలో వస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రానికి ‘హాయ్ నాన్న’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అధికారి ప్రకటన రాలేదు. ఇక ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ నెట్టింట్లో ఒక టాక్. ఈ మూవీలో నాని జెర్సీ మూవీ తరువాత మరోసారి తండ్రి క్యారెక్టర్ లో చేస్తున్నట్లు తెలుస్తోంది. పేరెంట్స్ విడాకులు తీసుకోగా వారి ఇద్దరి మధ్యలో  వారి పాప ఎలా సఫర్ అయ్యిందనేది ఈ మూవీ స్టోరీ అని టాక్.
ఇక ఈ చిత్రానికి కూడా కొత్త డైరెక్టర్ అయిన శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సీతారామం మూవీతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ ‘దసరా’ మూవీ తరువాత వస్తుండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: ఒక పాటలో నటించడానికి ”ఊర్వశి రౌతేలా” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?