Ads
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం NC 22 . ఈ సినిమాలో నాగ చైతన్య తో కృతి శెట్టి మరోసారి జత కట్ట నుంది. మరో వైపు వరుస తెలుగు చిత్రాలకు నో చెప్తున్న అరవింద్ స్వామి ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
Video Advertisement
ఇంకా పేరు పెట్టని ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ నాగ చైతన్య కి తొలి తమిళ చిత్రం కాగా, దర్శకుడు వెంకట్ ప్రభు కి ఇది తొలి తెలుగు సినిమా. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమా కథ మొత్తం ఒక కేసు చుట్టూ తిరుగుతూ ఉంటుందట. ఆ కేసును ఛేదించేందుకు ఒక కానిస్టేబుల్ చేసే ప్రయత్నం ను దర్శకుడు వెంకట్ ప్రభు చాలా ఆసక్తిగా చూపించబోతున్నాడు అంటున్నారు. ఆ కానిస్టేబుల్ పాత్రలో నాగ చైతన్య కనిపించబోతున్నాడు అనేది సమాచారం. కానిస్టేబుల్ గా నాగ చైతన్య కనిపించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నాగ చైతన్య గత చిత్రం నిరాశ పర్చిన నేపథ్యంలో ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు అక్కినేని ఫాన్స్. ఈ చిత్రానికి ఇళయరాజా తన కుమారుడు యువన్ శంకర్ రాజాతో కలిసి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం లో ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్ జి అమరన్, ‘కార్తీకదీపం’ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్, అరవింద్ స్వామి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
End of Article