“ఆదిపురుష్” ని దెయ్యాలకోట చేశారేంటయ్యా..? ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

“ఆదిపురుష్” ని దెయ్యాలకోట చేశారేంటయ్యా..? ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

by kavitha

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్ కు ముందు నుండి విమర్శలను ఎదుర్కొంటోంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత వివాదాలు, విమర్శలు మరింత పెరిగాయి. రిలీజ్ అయ్యి వారం గడుస్తున్నా ఏ మాత్రం తగ్గకపోగా ఈ మూవీని బ్యాన్ చేయాలి అనేంతగా పెరిగాయి.

Video Advertisement

టీజర్ రిలీజ్ చేసినప్పుడు పాత్రల తీరు, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వంటి వాటిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక, పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీ పై అంచనాలు అమాంతం పెరిగాయి. కానీ రిలీజ్ అయ్యాక విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా హాలీవుడ్ డబ్బింగ్ మూవీని ఆదిపురుష్ తో పొలుస్తూ ఎడిట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
adipurush-trollingదేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియెన్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఆదిపురుష్ మూవీని రూపొందించారు. ఈ మూవీ దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఈ మూవీలోని డైలాగ్స్ పై వినమర్శలు వచ్చాయి. ఆ తరువాత పాత్రల ఆహార్యం పైన  ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమాకి మొదటి 3 రోజులు మంచి వసూళ్లు వచ్చాయి. సోమవారం నుండి  పడిపోయాయి. ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్, రచయిత పై హిందూ సంఘాలు కూడా విమర్శిస్తున్నారు. ప్రేక్షకుల నుండి ప్రముఖుల వరకు అందరు విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.
ఈ మూవీలోని లంక సెట్, సీన్స్  హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ వీడియో క్లిపింగ్ కు దెయ్యాల కోట అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ వాయిస్ ఓవర్ తో ఎడిట్ చేసి షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

https://www.instagram.com/reel/CtqVkgVprWW/?igshid=NTc4MTIwNjQ2YQ%3D%3D

Also Read: “ఆదిపురుష్” ఫైట్ సీన్ కాపీ కొట్టారా..? ఏ సినిమా నుండి అంటే..?


End of Article

You may also like