Ads
వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, నటనతో అందరినీ కట్టిపడేసిన యూత్ ఫుల్ మూవీ బేబీ. విడుదలైన మొదటి రోజే మంచ బజ్ క్రియేట్ చేసింది. సినిమాలోని కాన్సెప్ట్ వల్ల చాలా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది ఏడుస్తూనే బయటకి వచ్చారు కూడా. ఇక పాటలకైతే సినిమా విడుదలకు ముందే బాగా అడిక్ట్ ఐపోయారు.
Video Advertisement
ముందు నుండే ప్రైవేట్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్న విజయ్ బల్గానిన్ సంగీతానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక బేబీ మూవీలో తను అందించిన పాటలు ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతున్నాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలో ఒక పాటపై డైరెక్టర్ సాయి రాజేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
అయితే బేబీ మూవీ ఊహించని విధంగా సక్సెస్ అందుకుంది. విడుదలైన 12 రోజుల్లోనే 71 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లను పలువురు సినీ ప్రముఖులు రవితేజ, సుకుమార్, అల్లు అర్జున్ తదితరులు తమ నటనను అభినందించారు. ఇంతటి ఆదరణ పొందిన సినిమాలో కాన్సెప్ట్ ఒక కీలకం అయితే, అందులో పాటలు మరొక ఎత్తు. ఇప్పుడు ఇందులో చందమామ అనే పాటను యాడ్ చేయనున్నట్టు డైరెక్టర్ సాయి రాజేష్ ప్రకటించారు.
అసలు ఆ పాటను ముందు యాడ్ చెయ్యాలి అనుకున్నాము కానీ కుదరలేదు. దాంతో చాలా మంది డిసప్పాయింట్ అవ్వడం వల్ల మళ్లీ ఆ పాటను యాడ్ చెయ్యబోతున్నారట. ఇక ఈ పాటను సింగర్ దీపు పాడదట. దీనికి సంబంధించిన ఫోటోను కూడా విడుదల చేసి ఈ పాటను యాడ్ చేస్తామన్నారు. దీంతో ఈ పాట కోసం మళ్లీ ఆ సినిమా చూసేందుకు కొందరు ప్రేక్షకులు మళ్లీ సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి.
ALSO READ : ప్రభాస్ ఫేస్ బుక్ లో ఊహించని వీడియోలు… అసలు సంగతేంటో తెలుసా??
End of Article