Ads
ఐపీఎల్ 2020 లో ఇవాళ హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ శుభమన్ గిల్ (36: 37 బంతుల్లో 5×4), ఇయాన్ మోర్గాన్ (34: 23 బంతుల్లో 3×4, 1×6), దినేశ్ కార్తీక్ (29 నాటౌట్: 14 బంతుల్లో 2×4, 2×6) స్కోర్ చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు, బసిల్ థంపీ ఒక వికెట్, విజయ్ శంకర్ ఒక వికెట్, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 163 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (36: 28 బంతుల్లో 7×4), కేన్ విలియమ్సన్ (29: 19 బంతుల్లో 4×4, 1×6) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన ప్రియమ్ గార్గె (4), మనీశ్ పాండే (6), విజయ్ శంకర్ (7) చేయగా అబ్దుల్ సమద్ (23: 15 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి కెప్టెన్ డేవిడ్ వార్నర్ (47 నాటౌట్: 33 బంతుల్లో 5×4) చేశారు. లాస్ట్ బాల్ కి రెండు పరుగులు అవసరమైనప్పుడు వార్నర్ సింగిల్ తీయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కి వెళ్లింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లలో ఫెర్గూసన్ (3/15) చేయగా, కమిన్స్ ఒక వికెట్, శివమ్ మావి ఒక వికెట్, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 163 పరుగుల స్కోర్ చేసింది. చివరి బంతికి రెండు పరుగుల కావాల్సిన సమయంలో ఒకే పరుగు రావదంతో మ్యాచ్ టై అయింది.మొదటి 4 బంతుల్లోనే రెండు వికెట్లు సమర్పించుకొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో కోల్‌కత విజయానికి కేవలం మూడు పరుగులే కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కేకేఆర్ తరపున బ్యాటింగ్ కు వచ్చిన మోర్గాన్, కార్తీక్ 4 బంతుల్లో మూడు పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.ఈ సూపర్ ఓవర్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20
End of Article