SRH సూపర్ ఓవర్ లో ఓడిపోవడం పై ట్రెండ్ అవుతున్న మీమ్స్….లాస్ట్ లో ఇలా అయ్యింది ఏంటి..

SRH సూపర్ ఓవర్ లో ఓడిపోవడం పై ట్రెండ్ అవుతున్న మీమ్స్….లాస్ట్ లో ఇలా అయ్యింది ఏంటి..

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో ఇవాళ హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కి, కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ శుభమన్ గిల్ (36: 37 బంతుల్లో 5×4), ఇయాన్ మోర్గాన్ (34: 23 బంతుల్లో 3×4, 1×6), దినేశ్ కార్తీక్ (29 నాటౌట్: 14 బంతుల్లో 2×4, 2×6) స్కోర్ చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు, బసిల్ థంపీ ఒక వికెట్, విజయ్ శంకర్ ఒక వికెట్, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 163 పరుగుల స్కోర్ చేసింది.

Video Advertisement

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (36: 28 బంతుల్లో 7×4), కేన్ విలియమ్సన్ (29: 19 బంతుల్లో 4×4, 1×6) స్కోర్ చేశారు. తర్వాత వచ్చిన ప్రియమ్ గార్గె (4), మనీశ్ పాండే (6), విజయ్ శంకర్ (7) చేయగా అబ్దుల్ సమద్ (23: 15 బంతుల్లో 2×4, 1×6)‌తో కలిసి కెప్టెన్ డేవిడ్ వార్నర్ (47 నాటౌట్: 33 బంతుల్లో 5×4) చేశారు. లాస్ట్ బాల్ కి రెండు పరుగులు అవసరమైనప్పుడు వార్నర్ సింగిల్ తీయడంతో మ్యాచ్‌ సూపర్ ఓవర్ ‌కి వెళ్లింది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లలో ఫెర్గూసన్ (3/15) చేయగా, కమిన్స్ ఒక వికెట్, శివమ్ మావి ఒక వికెట్, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 163 పరుగుల స్కోర్ చేసింది. చివరి బంతికి రెండు పరుగుల కావాల్సిన సమయంలో  ఒకే పరుగు రావదంతో మ్యాచ్ టై అయింది.మొదటి 4 బంతుల్లోనే రెండు వికెట్లు సమర్పించుకొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేయడంతో కోల్‌కత విజయానికి కేవలం మూడు పరుగులే కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కేకేఆర్ తరపున బ్యాటింగ్ కు వచ్చిన మోర్గాన్, కార్తీక్ 4 బంతుల్లో మూడు పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.ఈ సూపర్ ఓవర్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20


End of Article

You may also like