ఐపీఎల్ లో స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఉన్న ఈ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా? ఇంతకుముందు ఎక్కడ చూశామంటే..?

ఐపీఎల్ లో స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా ఉన్న ఈ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా? ఇంతకుముందు ఎక్కడ చూశామంటే..?

by Anudeep

Ads

ఈ అమ్మాయిని చూడగానే ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది కదా. ఈమె హెచ్ ఎమ్ టివి లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తరువాత 2013 లో స్టార్ మా లో VJ గా కూడా పని చేసారు. అయితే ‘చాయ్ బిస్కట్’ లైవ్ షో ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇక వరుసగా అవకాశాలు వచ్చాయి.

Video Advertisement

టీవీ 9 లో హాట్ వీల్స్, V6 లో లూట్ మార్, మా ఊరి వంట, ఈటివి హంగామా, జీ తెలుగు లో ఫ్యామిలీ సర్కస్ లాంటి షోలతో బాగా పాపులర్ అయిపొయింది. ఈ క్రమంలోనే ఆమె కెరీర్ ఊహించని మలుపు తీసుకుంది.

vindhya 1

2017 లో స్టార్ స్పోర్ట్స్ “ప్రో కబడ్డీ ప్రెజెంటేటర్” గా ఎంపిక అయింది. అక్కడ నుంచి స్పోర్ట్స్ ప్రెజెంటేటర్ గా ఆమె కొత్త కెరీర్ ను ప్రారంభించారు. ఈ ప్రయాణం ఆమెను ఐపీఎల్ కు చేర్చింది. ఐపీఎల్ తో పాటు ఐసీసీ వంటి ఉన్నత స్థాయి టోర్నమెంట్స్ కు కూడా ఆమె హోస్ట్ గా వ్యవహరించారు. చాలా తక్కువ కాలం లోనే మంచి పేరు సంపాదించుకున్నారు. మొట్ట మొదటి తెలుగు మహిళా స్పోర్ట్స్ ప్రెజెంటేటర్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు. స్పోర్ట్స్ ప్రెజెంటేటర్ గా రాణించడం అనేది ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. ఆటపై పూర్తి పట్టు కలిగి ఉండాలి. అలాగే ప్రతి మ్యాచ్ లో జరిగిన హైలెట్స్ ని కూడా గుర్తు పెట్టుకోవాలి.

vindhya 2

అందుకు సంబంధిత ప్రశ్నలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆటగాళ్లు ఎలా పెర్ఫామ్ చేసారు, టార్గెట్ ఎంత, పిచ్ రియాక్షన్ ఏంటి?, కీ ప్లేయర్స్ ఎవరు?, ఆపోజిట్ టీం ఎలా పెర్ఫామ్ చేసింది.. లాంటి విషయాలను గుర్తు పెట్టుకోవాలి. వీటిపై బాగా కసరత్తు చేస్తానని వింధ్య చెప్పుకొచ్చారు. ఎక్స్పర్ట్ ల వద్ద సంబంధిత ప్రశ్నలని అడగడం, ఎవరైనా ప్రముఖులు అభిప్రాయాలు చెప్తే వాటికి స్పందించడం కూడా చాలా ముఖ్యమని ఆమె చెప్పుకొచ్చారు. ఐపీఎల్ లో జరిగే ప్రతి మ్యాచ్ ప్రభావం తదుపరి మ్యాచ్ పడుతూ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. క్రికెట్ పై యావత్ ప్రపంచానికి అభిమానం ఉందని.. అందుకే నేను మాట్లాడేటప్పుడు ఎదో ఒక్క యాసను ఎంచుకోవడానికి ఒప్పుకోనని.. వ్యాఖ్యానం చేసేటప్పుడు మందిర బేడీ, మయంతి లాంగర్ వంటి వారి వీడియోలు చూసి స్ఫూర్తి పొందుతానని చెప్పుకొచ్చారు.

vindhya 3

ఈరోజు ఈస్థాయిలో ఉండడానికి కారణం మా అమ్మేనని.. ఆమె చిన్నప్పుడు స్పోర్ట్స్ లో రాణించాలని భావించారని.. కానీ సంప్రదాయం ఆమె ఆశలకు అడ్డు కట్ట వేసిందని.. అయినా నన్ను అలా ఆపెయ్యకుండా నేను కన్న కలలు నెరవేర్చుకోడానికి తోడ్పాటు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నేను ముంబై లో ఉంటున్నప్పటికీ.. పక్కా హైదరాబాదీనని చెప్పుకొచ్చారు. ఘట్ కేసర్ వద్ద పుట్టి పెరిగానని, శ్రీ చైతన్యలోనే ఇంటర్ పూర్తి చేసానని చెప్పుకొచ్చారు. కస్తూర్భా గాంధీ ఉమెన్స్ కాలేజీ లోనే డిగ్రీ చదివానని అక్కడ నా కల ఏంటో బోధపడింది అని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like