ఆ అరుదైన వ్యాధి తో బాధ పడుతున్న అనుష్క శెట్టి..??

ఆ అరుదైన వ్యాధి తో బాధ పడుతున్న అనుష్క శెట్టి..??

by Anudeep

Ads

సిల్వర్‌ స్క్రీన్ పై తమ అందం, అభినయంతో అలరిస్తోన్న సినిమా తారలు వరుసగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల స్టార్‌ హీరోయిన్లు సమంత, మమతమోహన్‌దాస్‌, శ్రుతిహాసన్‌ తమకున్న హెల్త్‌ ఇష్యూస్‌ను బయటపెట్టి షాక్ ఇచ్చారు. అలాగే తాజాగా తాను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించి షాక్‌ ఇచ్చింది సీనియర్‌ నటి రేణు దేశాయ్‌. ఇప్పుడీ జాబితాలోకి మరో స్టార్‌ హీరోయిన్‌ చేరింది. ఆమే అందాల తార అనుష్క శెట్టి..

Video Advertisement

 

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనుష్కకి .. ‘బాహుబలి’ చిత్రం తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా ఆమె దాన్ని ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత అనుష్క భాగమతి, నిశ్శబ్దం చిత్రాలు చేసింది. కానీ ఆ చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక సినిమా ఉంది. అయితే తాజాగా తమిళం లో ఒక యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకొక అరుదైన సమస్య ఉన్నట్లు అనుష్క స్వయంగా వెల్లడించింది.

is anushka suffering from rare disease..??

ఒకసారి నవ్వడం స్టార్ట్ చేస్తే ఏకధాటిగా 15 నుంచి 20 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా అనుష్క నవ్వుతూనే ఉంటుందట. తాను నవ్వడం మొదలు పెడితే షూటింగ్ కు ప్యాకప్ చెప్పాల్సిందేనని ఏకధాటిగా 15 నుంచి 20 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటానని ఈ గ్యాప్ లో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్ స్నాక్స్ లాంటివి కంప్లీట్ చేసుకుని వస్తారని అనుష్క వివరించారట. అయితే దీనిపై అనుష్క అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

is anushka suffering from rare disease..??

అనుష్క ప్రస్తుతం ప్రస్తుతం నవీన్ పోలీస్ శెట్టి పక్కన హీరోయిన్ గా ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. యువి క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీకి `మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి` అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఓ చెఫ్ పాత్రలో ఈమె కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.


End of Article

You may also like